బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో వలస కూలీలకు నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డు లేని వారిని గుర్తించి ఇరవై కిలోల బియ్యం నిత్యావసర సరుకులను సర్పంచ్ శ్రీరేఖ రాజు, తహశీల్దార్ వెంకటరావు ఎంపిడిఓ ఆనంద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ముందుగా పారిశుధ్య కార్మికులకు సన్మానం చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వైద్య సిబ్బంది ఆశ కార్యకర్తలకు పంచాయతీ సిబ్బందికి సన్మానం చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రావు మాట్లాడుతూ లాక్డౌన్ వేళలో ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య కార్మికులు వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ప్రజలకు చేసిన సేవలు ఎంతో గొప్పవని వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ ఎంపిడివోలతో పాటు ఉపసర్పంచ్ నాగరాజు వైద్య సిబ్బంది గంగమణి, బాలమణి ,ఫ్లారెన్స్, ఆశా కార్యకర్తలు చంద్రకళ, విజయలక్ష్మి ,కె లక్ష్మి , పి.లక్ష్మి, నాగమణి, పద్మ ,సుమలత, సునిత పంచాయతీ పాలకవర్గ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.