28.7 C
Hyderabad
April 20, 2024 08: 17 AM
Slider హైదరాబాద్

బోనాలు ఊరేగింపులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు

#sanitation

దేవాలయాల ప్రాంతాలు ప్రధాన రహదారులలో ఊరేగింపులకు అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద మట్టి కుప్పలు వెంటనే తొలగించాలని, దేవాలయాల చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో రోడ్డు ప్యాచ్ వర్క్ లను వెంటనే పూర్తి చేయాలనని జిహెచ్ఎంసి అధికారులను బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి ఆదేశించారు.

బుదవారం రానున్న బోనాల పండుగను పురస్కరించుకొని మల్లికార్జున్ నగర్ పోచమ్మ గుడి, దోబీ ఘట్ ఈదమ్మ గుడి, డి.డి వాటర్ వర్క్స్ పోచమ్మ గుడి, గజానంద్ గడ్డ నల్లపోచమ్మ గుడి, వడ్డెర బస్తీ పోచమ్మ గుడి, బురరుజు గల్లీ బంగారు మైసమ్మ గుడి, పోచమ్మ బస్తి పోచమ్మ గుడి, బతుకమ్మకుంట రోడ్డు మధ్యలో ఉన్న ఎల్లమ్మ, మైసమ్మ గుడి, బతుకమ్మకుంట శ్రీమివాస పాఠశాల దగ్గర ఉన్న మైసమ్మ గుడి, గంగాబౌలి మల్లన్న గుడి, సంజయ్ నగర్ పోచమ్మ గుడి, పాపాజీ ఢాబా ఎదురుగా ఉన్న అమ్మవారి గుడి ప్రాంతాలలో పర్యటించి వడ్డెర బస్తీలో పాడైపోయిన రోడ్డులో కంకర డస్ట్ తో గుంతలలో ప్యాచ్ వర్క్ చేయించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ లోని కొన్ని ప్రాంతాలలో కృంగిపోయి ఉన్న డ్రైనేజీ మాన్ హోల్ లను వెంటనే మరమ్మతులు చెప్పట్టాలని, దేవాలయాల దగ్గర ఉన్న హ్యాండ్ బోరింగ్ మరమ్మతు పనులు చెప్పటాలని, డ్రైనేజీ లైన్ లు ప్రొంగి ప్రవహించకుండా ముందు జాగ్రత్తగా శుభ్రపరిచి డ్రైనేజీ మాన్ హోల్స్ లో నుండి తీసిన మట్టిని వెంటనే తొలగించాలని జల మండలి అధికారులని ఆదేశించారు.

జిహెచ్ఎంసి వీధి దీపాల అధికారులు బోనాల పండుగ సందర్బంగా పాడైపోయిన వీధి దీపాల మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలనీ, దేవాలయాల వద్ద తాత్కాలిక లైట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, ప్రధాన కార్యదర్శి జమ్మిచట్టు బాలరాజు, బిజెపి నాయకులు మిర్యాల శ్రీనివాస్, సాయన్న,గోవింద్ అర్జున్, సుజాత, బాలకృష్ణ గౌడ్, ఏడెల్లి రాము, శివ మూర్తి, శశికాంత్, శేఖర్ మరియు అనేకమంది పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

రైతుల కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Satyam NEWS

తెలంగాణలో చిన్నారుల వరుస కిడ్నాప్ లు: నేడు మరొకటి

Satyam NEWS

నాటి ప్రకాశం గారి పార్క్…నేడు మహిళా పార్క్…కానీ…!

Bhavani

Leave a Comment