28.7 C
Hyderabad
April 25, 2024 05: 47 AM
Slider హైదరాబాద్

సీజనల్ వ్యాధుల నివారణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

#kaleruvenkatesh

సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు ఉదయం 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గల మొక్కల తొట్టిల్లో ఉన్న నిల్వ నీటిని తొలగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ఇళ్లను, ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తద్వారా దోమలను నివారించి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సురక్షితంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీసీ వేణుగోపాల్, ఏంట్మాలాజీ ఏఈ అంబిక, ఫీల్డ్ ఆస్సీటెంట్ వెంకటయ్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఉద్యమకారునికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన కార్పొరేటర్ శ్రీదేవి

Bhavani

ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం

Satyam NEWS

సిద్ధిపేటలో ఆన్ లైనులో నిత్యావసర సరుకులు

Satyam NEWS

Leave a Comment