27.7 C
Hyderabad
April 20, 2024 02: 10 AM
Slider ముఖ్యంశాలు

ఎలర్ట్: కలకలం సృష్టిస్తున్న నంద్యాల శానిటైజర్లు

Nandyala Sanitizer

తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణా నదీ తీర ప్రాంతాల వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికే నదిలో ప్రయాణాన్ని పోలీసులు కట్టడి చేశారు. బోట్లు కాదు కదా పుట్టి పై ప్రయాణం కూడా నిషేధించారు.

ఇలా పుట్టిపై ఆంధ్రా గట్టు నుంచి తెలంగాణ గట్టుకు వస్తున్న వారిని అడ్డుకుని వారిపై కేసులు పెట్టారు. కర్నూలు జిల్లా దగ్గరగా ఉండే తెలంగాణ ప్రాంతాలకు ఈ చర్యలతో కరోనా ముప్పు తప్పినట్లుగా అనిపించడం లేదు. కర్నూలు జిల్లాలో కరోనా దారుణంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.

కర్నూలు నుంచి తెలంగాణ భూభాగంలోకి కరోనా రాకుండా చూస్తున్నా ఇప్పటికే నమోదైన రెండు మూడు కేసులు కర్నూలు నుంచి వచ్చినవేనని నిర్ధారణ కూడా జరిగింది. మనుషులు రాకుండా అడ్డుకుంటున్నారు కానీ కర్నూలు జిల్లా నుంచి వస్తున్న సరకు ను మాత్రం పోలీసులు గానీ స్థానిక రెవెన్యూ అధికారులు గానీ స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు గానీ అడ్డుకోవడం లేదు.

కొల్లాపూర్ ప్రాంతంలో కర్నూలు జిల్లా నంద్యాల లో తయారై వచ్చిన శానిటైజర్లు వాడుతున్నారు. తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో మనకేం కాదులే అనే ధైర్యంతో చేస్తున్నారో తెలియదు కానీ కొందరు రాజకీయ నాయకులే నంద్యాల నుంచి వచ్చిన శానిటైజర్లను కొల్లాపూర్ లో పంపిణీ చేస్తున్నారు.

ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ వాడితే కరోనా పోతుంది కానీ శానిటైజర్ పైన ఉండే కవర్, పైన ప్యాకింగ్ చేసే అట్టపెట్టెల నుంచి కరోనా వైరస్ దిగుమతి కావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతం నుండి  ఎలా ట్రాన్స్ పోర్ట్ అవుతున్నాయో తెలియాదు…తెచ్చే వాళ్ల నుండి జాగ్రత్తగా ఉండండి..నాయకులు కూడా గమనించండి…. ఎక్కడి నుంచో ఫ్రీగా వస్తున్నాయి కదా అని తెలిసీ తెలియకుండా నంద్యాల శానిటైజర్లు ప్రజలకు పంచి పెట్టవద్దు.

Related posts

సమగ్ర శిక్షా పథకం కొనసాగింపునకు కేబినెట్ కమిటీ ఆమోదముద్ర

Satyam NEWS

సైట్ ఇష్యూ: ఏపి ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్

Satyam NEWS

తరుగు పేరుతో ధాన్యం ధర తగ్గించడం అన్యాయం

Satyam NEWS

Leave a Comment