శ్రీశైలంలో నేటి నుంచి 17వ తేదీ దాకా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలు సుందరంగా ముస్తాబు అయ్యాయి.
అజిత హోమాలు స్వామి అమ్మవార్ల కళ్యాణము ఏకాంత సేవలు నిలిపివేస్తున్నారు. కోవిడ్ నిబంధనల భాగంగా గ్రామ ఉత్సవాలు నిర్వహించకుండా మాడ వీధుల్లో నే ఊరేగింపు నిర్వహిస్తారు. కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తారు.
వివరాలు:
13వ తేదీన ఉదయం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమం
14వ తేదీన మహిళలకు ముగ్గులపోటీలు
16వ తేదీన వేదసభ కార్యక్రమం
కనుమ పండుగ రోజున (15.01.2021) సంప్రదాయబద్దంగా గో పూజ మరియు బాలబాలికలకు వ్యాసరచన, వకృత్త్వ (ఉపన్యాస) పోటీలు నిర్వహిస్తారు.