27.7 C
Hyderabad
April 26, 2024 05: 03 AM
Slider విశాఖపట్నం

ఖాకీ రంగు యూనిఫామ్ కాసేపు పక్కన పెట్టిన పోలీసులు…

#dig

సంప్రదాయం ఉట్టిపడేలా విజయనగరం బ్యారెక్స్ లో “సంక్రాంతి సంబరాలు”

`పోలీసు అంటే నే…నడుం కు బెల్టు…శరీరం పై ఖాకీ రంగు యూనీఫాం …చేతిలో లాఠీ..నడుం కు వెపన్… అయితే వీటినన్నింటినీ కాసేపు పక్కన పెట్టించారు…విజయనగరం జిల్లా పోలీసు బాస్…ఎస్పీ దీపికా పాటిల్. అలాగే ఏపీ పోలీసు అదే ఐపీఎస్ ఆఫీసర్స్ వైఫ్ లు సంయుక్తంగా నిర్ణయించిన మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంబంధిత రేంజ్ డీఐజీ భార్యలు..ముఖ్య అతిథిలుగా హాజరై…ఆయా జిల్లా ల బ్యారెక్స్ లలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

ఈ క్రమంలో పోలీసు సిబ్బంది యావత్తు… కానిస్టేబుల్ నుంచీ ఎస్పీ వరకు ఖాకీ యూనీఫాం పక్కన పెట్టి సివిల్ డ్రస్ లో ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఆర్మర్డ్, సీవిల్ ,హోం గార్డ్, స్పెషల్ పార్టీ ఇలా పోలీసు శాఖలో అన్ని విభాగ అధిపతులు… సంప్రదాయ వస్త్రాలైన తెల్లటి పంచె ,భుజం మీద ధోవతి ,లేడి సిబ్బంది… చీరలు ధరించి.. సంక్రాంతి సంబరాలను సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ భార్య శ్వేత హరికృష్ణ హాజరై…ఎస్పీ దీపికా, ఏఆర్ ఏఎస్పీ సల్మాన్, సెబ్ ఏఎస్పీ, అలాగే ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, డీఎస్పీ లు మోహన్ రావు, శ్రీనివాసరావు, సీఐలు తిరుపతి రావు, లక్ష్మణరావు, మురళీ ఎస్ ఐలు వాసుదేవ్, జయంతి, పద్మావతి, శిరీష లు పాల్గొన్నారు.

Related posts

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి చిన్నారెడ్డి

Satyam NEWS

[Over|The|Counter] Michael Dempsey Pills For Blood Sugar Remedy

Bhavani

నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి వుంచుకోవచ్చు

Satyam NEWS

Leave a Comment