28.2 C
Hyderabad
January 21, 2022 16: 41 PM
Slider కడప

కడప జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

#kadapa

కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడు గ్రామంలో జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో మహిళలకు ,పురుషులకు కబడి, ఎద్దుల బండ్లు తిప్పుట, తాడులాగుట, గొబ్బెమ్మ, కోలాటాలు, నృత్య పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిధులుగా రాయచోటి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే చీప్ విప్ కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట మునిసిపల్ ఛైర్మెన్ పోలా శ్రీనివాసుల రెడ్డి, వైసీపీ శ్రేణులు పోలా రమణా రెడ్డి,అకేపాటి అనిల్ రెడ్డి,పోలి మురళి,జబ్బిరెడ్డి వెంకట రెడ్డి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిసర ప్రాంత ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి,కోలాహలంగా తిలకించారు. సంక్రాంతి సంబరాలు ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహం గా జరిగాయి.

Related posts

TAIKA మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభం

Satyam NEWS

ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

రాయలసీమ లిఫ్ట్ పనులను వెంటనే నిలిపివేయాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!