37.2 C
Hyderabad
March 29, 2024 19: 37 PM
Slider ప్రకాశం

శాప్ నెట్ చైర్మన్ గా బాచిన కృష్ణ చైతన్య బాధ్యతల స్వీకరణ

#SAPNET

శాప్ నెట్ చైర్మన్ గా యువనాయకుడు బాచిన కృష్ణ చైతన్య నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాంకేతికంగా పురోగమిస్తున్న ఈ దశలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నది శాప్ నెట్ అని ఈ సందర్భంగా బాచిన కృష్ణ చైతన్య అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో స్యయం ప్రతిపత్తితో పని చేస్తున్న సంస్థ సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్ …శాప్ నెట్. టెలీ మెడిసిన్, దూర విద్య, వ్యవసాయ అనుబంధ విద్య తదితర అత్యవసర అంశాలలో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి శాప్ నెట్ ఒక పెద్ద ఆయుధం. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధునిక భావాలకు అద్దం పడుతున్న శాప్ నెట్ ఇప్పుడు కొత్త రూపం సంతరించుకోబోతున్నది.

రాష్ట్రంలో అత్యంత అవసరమైన విద్యావిషయాలను ప్రజలకు అందిస్తూ, సాంకేతికంగా ప్రజలు పురోగమించడానికి దోహదం చేస్తున్న సంస్థ ఇది అని ఆయన అన్నారు. అనునిత్యం అవసరమైన అన్ని అంశాలను శాప్ నెట్ విద్యా విషయాలుగా ప్రజలకు అందిస్తుంది. ఉపగ్రహం ద్వారా ప్రసారాలు చేసే శాప్ నెట్ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న శాప్ నెట్ ఇప్పుడు ప్రజలకు అత్యవసర విద్య అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. స్కూళ్లకు రాలేని వారికి దూర విద్య అందించడం, వ్యవసాయానికి సంబంధించిన మెళకువలను రైతులకు అందించడం, అధునాతన టెలీమెడిసిన్ సౌకర్యాలను ప్రజలకు అందించడం శాప్ నెట్ అందిస్తున్న ముఖ్యమైన సేవలు.

ఇవే కాకుండా మానవ వనరుల అభివృద్ధి, ఈ గవర్నెన్స్ లాంటి కీలక అంశాలలో శాప్ నెట్ ప్రధాన పాత్ర వహిస్తున్నది. శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ ను సామాజిక ప్రయోజనాలకు ఉపయోగించడంలో శాప్ నెట్ ముందున్నది. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాప్ నెట్ మరింత పురోగమిస్తుందని ఆశిస్తున్నామని వక్తలు అన్నారు. అదే విధంగా యువ నాయకుడు బాచిన కృష్ణ చైతన్య శాప్ నెట్ ను మరింత సమర్ధంగా ప్రజల కోసం ఉపయోగిస్తారని కూడా ఆశిస్తున్నామని వారు తెలిపారు.

అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, ఇంధన, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, బాపట్ల నందిగం సురేష్ బాబు, మార్కాపురం ఎమ్మెల్యే కందుకూరు నాగార్జున రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఎమ్మెల్సీ పోతుల సునీత, అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి(దర్శి) శాప్ నెట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ప్రజ్ఞాధర్ రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్ వంశీ చుక్కా తదితరులు పాల్గొన్నారు.

Related posts

యాంటీ జగన్: మూడు రాజధానులకు బిజెపి వ్యతిరేకం

Satyam NEWS

అత్యాధునిక సాంకేతికతతో విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల ఆధునికీకరణ

Satyam NEWS

గిరిజన ప్రాంత సమగ్రాభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment