24.2 C
Hyderabad
July 20, 2024 18: 52 PM
Slider సంపాదకీయం

ఆనాడు జగన్ కు తాకట్టు… ఈనాడు బాబు కాళ్లకు దణ్ణంపెట్టు…

#swaroopananda

హిందూ ధార్మిక సంస్థ గా పెట్టుకున్న శారదా పీఠం ను ఇంత కాలం క్రైస్తవుడైన జగన్ కు తాకట్టు పెట్టిన ఆ పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఇప్పుడు అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించాడు. చంద్రబాబునాయుడు ముఖ్య మంత్రి అవుతారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని స్వరూపానందేంద్ర అంటున్నాడు. క్రైస్తవుడైన జగన్ కు మద్దతుగా ఆయన తల్లి విజయలక్ష్మి బైబిల్ పట్టుకుని తిరిగేది. ఆ ఎన్నికల్లో జగన్ గెలవలేదు. దాంతో ఆ తర్వాతి ఎన్నికలకు జగన్ మతాన్ని తాను మార్చినట్లు గంగలోనో గోదావరి లోనో ముంచేసి మతమార్పిడి చేసినట్లు స్వరూపానందేంద్ర కొన్ని ఫొటోలను విడుదల చేశాడు.

దాంతో చాలా మంది జగన్ మతం మార్చుకున్నాడని, జగన్ మతాన్ని స్వరూపానంద్ర మార్చాడని పెద్ద ఎత్తున ప్రజలు నమ్మారు. అయితే జగన్ గానీ, ఆయన భార్య గానీ మతం మార్చుకోలేదు. జగన్ భార్య భారతి ఏనాడూ తిరుమలకు వెళ్లలేదు. పైగా తిరుమల సెట్టింగ్ ను ఇంట్లోనే వేసుకుని అక్కడ ఇచ్చిన తీర్థ ప్రసాదాలను కూడా భారతి తీసుకోకుండా, తీసుకున్నట్లు నటించి హిందువులను మోసం చేసే ప్రయత్నం చేశారు.

వీటన్నింటికి కారణం స్వరూపానంద్ర. అయితే ఇప్పుడు అలాంటి స్వరూపానంద ప్లేట్ ఫిరాయించి చంద్రబాబునాయుడిని పొగుడుతున్నాడు. అది నోరా… లేక…? తాటి పట్టా అని ప్రజలు ఇప్పుడు ఈ స్వామిని ప్రశ్నిస్తున్నారు. చంద్ర బాబుకు మేము వ్యతిరెకం కాదు‌…. మేము స్వాములం, పీఠాధిపతులం… ఎవరికీ అనుకులమో లేక వ్యతిరేకమో కాదు‌‌..అని స్వరూపానంద అనడం‌ ఆశ్చర్యం కలిగిస్తున్నదని ప్రజలు అంటున్నారు.

జగన్ కోర్టులని మేనేజ్ చేసి దేవుళ్ళతో కూడా ఆడుకున్నాడు.. ఇప్పుడు నాశనం అయిపోయాడు.. అంటూ ఆయన జగన్ పై తిరగబడ్డాడు కూడా. నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే, ఎర్రన్నాయుడితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రి కావడం ఆనందకర విషయం. రామ్మోహన్ చిన్న వయసులో కేంద్ర మంత్రి అయ్యాడంటే చంద్రబాబే కారణం అంటూ ఈ దొంగ స్వామి నాలికను మడతపెట్టాడు. అమ్మవారి కృపచేత బీజేపీ మూడోసారి పాలనలోకి వచ్చింది. మోదీ ప్రమాణం చేయడం మాకు ఆనందం ఇచ్చింది. చంద్రబాబు రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా విశాఖ శ్రీ శారదా పీఠం అనుగ్రహం ఉంటుంది అంటూ ఎవరూ అడగకపోయినా అనుగహాన్ని ఈ దొంగ స్వామి ప్రసాదించాడు. చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్తం అత్యద్భుతంగా ఉందని, ప్రభుత్వ మంచి కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తా అని ఈ స్వరూపానంద స్వామి ప్రకటించాడు.

నువ్వు స్వామి కాదురా …. ప్రమాణ స్వీకారం అవకుండానే ప్లేట్ తిప్పేసావు. నువ్వు జగన్ కి పెట్టిన ముద్దులు చేసిన చిన్నెలు మర్చిపోతామా అంటూ తెలుగుదేశం పార్టీ వారు ప్రశ్నిస్తున్నారు.

Related posts

మహానాడు తీర్మానాలకు ఆమోదం తెలిపిన పొలిట్ బ్యూరో

Satyam NEWS

దేశం మెచ్చిన నాయకుడు కెసిఆర్: శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

యూనివర్సిటీ టాపర్ గా ప్రత్యూష ప్రియదర్శిని….

Satyam NEWS

Leave a Comment