28.2 C
Hyderabad
April 20, 2024 13: 09 PM
Slider పశ్చిమగోదావరి

మావుళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు

#Maavullamma

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు మహాలక్ష్మి దేవి అలంకారం తోమావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, చండీ హోమం నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు.

శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. నిత్యం బంగారు చీర తో దర్శనమిచ్చే మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీగా వస్తుంటారు.

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని భక్తులను కోరుతున్నారు ఆలయ అధికారులు. మాస్క్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.

Related posts

Counter attack: లక్ష్మీపార్వతి పాచిక పారేనా?

Satyam NEWS

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం

Satyam NEWS

నిత్యం కొత్తగా ఆలోచిస్తేనే శాస్త్రీయ ఆలోచనలు పెంపొందుతాయి

Satyam NEWS

Leave a Comment