బుధవారం కలెక్టరేట్ లో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా, గీతా కార్మికుడిగా తన ప్రస్థానంలో అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడని అన్నారు. బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు, మొగల్ లు శిస్తుల రూపంలో పన్నుల వసూల్ల పేరుతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో ప్రజలకు అండగా నిలిచి పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్సి సంక్షేమ శాఖ అధికారిని సరోజ, వివిధ శాఖల అధికారులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post