స్వాతంత్య్రసమర యోధులను ఆదర్శంగా తీసుకొని దేశానికి సేవ చేయాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని కర్నూలు జిల్లా డోన్ కు చెందిన సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి అన్నారు. స్వాతంత్ర్య సమర యోధురాలు సరోజినీ నాయుడు జయంతి సందర్బంగా డోన్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆమెకు ఘన నివాళి అర్పించారు.
స్కూల్ ఇంచార్జ్ హెచ్ యం.ఎ. గ్రేసమ్మ అధ్యక్షతన సరోజినీనాయుడు చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుశీల , గౌరి, ఇంద్రాణి, పద్మా, రిటైర్డ్ హెచ్ యం ఎ. ఏసురత్నం విద్యార్థులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి ఆరోగ్యం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ముక్కు, నోటికి చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలని, నీళ్ళు శరీరాని తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ పుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాల లో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాల లో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని తెలిపారు.