30.7 C
Hyderabad
April 19, 2024 09: 59 AM
Slider సినిమా

అందరిని అలరించిన పౌరాణిక నాటక ప్రదర్శనలు

#satyaharischandra

శ్రీ నంది కోటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా కల్వకోల్ గ్రామంలో దేవాలయ కమిటీ గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజల సహకారంతో శృతిలయ కల్చరల్ అకాడమీ కొల్లాపూర్ వారి ఆధ్వర్యంలో పౌరాణిక నాటక ప్రదర్శన జరిగింది. సత్యహరిచంద్ర పూర్తి  పౌరాణిక నాటకం. చింతామణి నాటకం నుంచి భవాని సీను, శ్రీకృష్ణరాయబారం నుండి పడక సీన్ బాలనాగమ్మ నాటకం నుండి మాయల పకీర్ సీన్ లు భక్తులను, ఔత్సాహికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతరించి పోతున్న పౌరాణిక, పద్య నాటకాలకు జీవం పోసి, ముందు తరాలకు తెలిజేయాలనే సంకల్పంతో పండుగ, పర్వదినాలలో ప్రదర్శనలు ఇస్తున్నామని  శృతిలయ కల్చరల్ అకాడమీ అధ్యక్షులు జి.కె.వెంకటేష్ తెలియజేశారు.

సత్య హరిశ్చంద్ర నాటకం లో హరిశ్చంద్రుడు గా జి.కె.వెంకటేష్ వేణుమాధవ్ గౌడు ఈశ్వరయ్య విష్ణుమూర్తి చక్కగా నటించారు చంద్రమతిగా రాజేశ్వరి నటించారు. భవాని శంకర్ జీకే వెంకటేష్ మాయల పకీర్ గా యుగంధర్  నక్షత్రకుడుగా రామకృష్ణ సాయిబాబా గౌడు చక్కగా అభినయించారు. పడక సీన్ నుండి టి. కృష్ణ (ఎనుగొండ) కృష్ణుడిగా  దుర్యోధనుడిగా దామోదర్, అర్జునుడు బలరాముడు చక్కగా అభినయించారు.

Related posts

తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన పునఃప్రారంభం

Satyam NEWS

ఈ సారైనా సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి అవుతాడా?

Satyam NEWS

వనమూలికా మహోత్సవంగా ఆచార్య బాలకృష్ణ జన్మదినం

Bhavani

Leave a Comment