39.2 C
Hyderabad
March 29, 2024 16: 36 PM
Slider ప్రత్యేకం

ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో అడుగు పెట్టిన స‌త్యం న్యూస్.నెట్

#paderu forest area

మావోలు సంచ‌రించే ప్ర‌దేశంలో రెండు గంట‌ల పాటు…!

సోష‌ల్ మీడియా పుంతలు తొక్కుతున్న ఈ స్పీడ్ యుగంలో సెక‌న్ల‌లో ఎవ‌రు ఏది చేసినా క్ష‌ణాల‌లో విశ్వ వ్యాప్తం అవుతోంది. అలాంటిది మీడియా రంగంలో అపార అనుభ‌వం క‌లిగిన రిపోర్ట‌ర్ లు,జ‌ర్న‌లిస్ట్ ల‌తో వ‌స్తున్న పోటీకి త‌ట్టుకుని ఎప్ప‌టిక‌ప్పుడు తాజా,సంచ‌ల‌న‌మైన వార్త‌ల‌ను  వీడియా రూపంలో ఇస్తున్న స‌త్యం న్యూస్.నెట్..ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో అడుగు పెట్టింది.

అదీ అట‌వీ శాఖ  అధికారుల‌తోనే అనుకోండి. ఏపీలోని విశాఖ జిల్లా. త్వ‌ర‌లో రాష్ట్ర రాజ‌ధాని కాబోతున్న విశాఖ జిల్లా అట‌వీ ప్రాంతం ఏదైనా ఉందంటే అది చింత‌ప‌ల్లి,ముంచిగ పుట్టు.జీకే.వీధి, పాడేరు ప్రాంతాలే.  ఈ ప్రాంతాల‌లో అను నిత్యం  స్పెష‌ల్ ప్రొట‌క్ష‌న్ పోలీసులు ఆయుధాల‌తో ప‌హారా కాస్తున్నారంటే…మావోయిస్టుల ప్ర‌భావం ఏ మేర‌కు ఉందే విశిదం చేసుకోవ‌చ్చు.

ఇటువంటి ప‌రిస్థితుల‌లో స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిధి విశాఖ జిల్లాలోని పాడేరులో అడుగు పెట్టారు. అదీ  పాడేరు అట‌వీశాఖ అధికారిని ఇంట‌ర్వ్యూ చేసింది. జిల్లాలోని ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం అయిన చింత‌ప‌ల్లి,ముంచిగ పుట్టులో ప‌ని చేసిన డీఎఫ్ ఓ వినోద్ కుమార్ తో స‌త్యం న్యూస్. నెట్ ప్ర‌తినిధి మావోలు కార్య‌క్ర‌మాల గురించి కూడా ప్ర‌స్తావించారు.

తొలుత  విజ‌య‌న‌గ‌రం సోష‌ల్ ఫారెస్ట్ అధికారితో మ‌ద్య‌హ్నం 12.30 బ‌య‌లు దేరిన స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిధి  చిన్నాపురం,కొరుకొండ‌, అల‌మండ‌, కొత్త‌వ‌ల‌స‌, మీదుగా పాడేరుకు చేరుకున్నారు. మార్గ మ‌ధ్య‌లో దట్ట‌మైన అట‌వీ ప్రాంతం గుండా మీదుగా గుట్టు చ‌ప్పుడు కాకుండా  గంజాయి ర‌వాణ జ‌రిగే ప్రాంతాల‌ను దాటుకుంటూ ర‌మామ‌రి  నాలుగు గంట‌ల‌కు పాడేరు చేరుకున్నారు.

దారి పొడువున మార్గ మ‌ధ్యలో వెప‌న్ (ఆయుధాలు) తో ఎస్టీఎఫ్ ద‌ళాలు మావోల స‌మాచారం క‌నుక్కునేందుకు మ‌రోవైపు ఏరివేత‌కు సంచ‌రిస్తునే ఉన్నారు.అలాగే ఘాట్ రోడ్ లో నే పిచ్చోళ్ల మాదిరిగా ఇద్దరు ముగ్గురు సంచ‌రించ‌డాన్ని స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిథి గుర్తించారు కూడ‌.

వాళ్లే అటు ప్ర‌భుత్వ స‌మ‌చార‌మైన ఇటు గ్రామంలో ఎవ‌రు వ‌చ్చారు…ఎందుకోసం వ‌చ్చార‌న్న సమాచారం తెలుసుకుని  మావోయిస్టుల‌కు ఇస్తారు.ఎట్ట‌కేల‌కు పాడేరుకు చేరుకుని డీఎఫ్ ఓ ను ఇంట‌ర్వ్యూ చేసింది.అదే స‌మ‌యంలో అర‌కు ఎమ్మెల్యే కూడా డీఎఫ్ ఓను క‌లిసేందుకు వ‌చ్చారు కూడ‌.  సీన్ క‌ట్ చేస్తే…. గిరిజ‌నుల‌తో మ‌మేక‌మై…ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డ‌మే త‌మ  శాఖ ల‌క్ష్య‌మ‌ని  డీఎఫ్ ఓ వినోద్ కుమార్ అన్నారు.  

గ్రీన్ ఇండియా మిష‌న్ లో బాగాంగా పాడేరు ఫారెస్ట్ డివిజ‌న్ లో దాదాపు 570 హెక్టార్ల‌లో  ప్లాంటేష‌న్ జ‌రుగుతోంది. వ‌న సంర‌క్ష‌|ణ స‌మితిల(వీఎస్ఎస్) ద్వారా ఈ  ప్లాంటేష‌న్  గిరిజ‌నుల‌చే చేప‌ట్ట‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. దేశ వ్యాప్తంగా 8 మిష‌న్ ల‌లో  గ్రీన్ ప్లాంటేష‌న్ మిష‌న్ ఒక‌టి అని అన్నారు. ఐటీడీఏ ప‌రిధిలో అలాగే పాడేరు అట‌వీ డివిజ‌న్ లో…మొక్క‌ల‌ను పెంచి…మైద‌నా ప్రాంతాలలో  నాటేందుకు య‌త్నిస్తున్నామ‌న్నారు.

ఇక పోతే జిల్లాలోని చింత‌ప‌ల్లి అట‌వీ ప్రాంతం  అత్య‌ధికంగా మావోయిస్టుల సంచ‌రించ ప్రాంత‌మ‌ని…ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. వాళ్లంతా త‌మ ప‌క్క‌నే ఉంటున్నా తెలియ‌కుండా ఉంటార‌న్నారు. ప్ర‌జల‌ ఆస్థుల విషయంలో స్థానిక గిరిజులు ఏది చెబితే దానికే వాళ్లు అంగీక‌రిస్తార‌న్నారు. వెప‌న్ లేనిదే  ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలోకి వెళ్ల‌మ‌న్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

నూతన సంవత్సర వేడుకలపై పోలీసు ఆంక్షలు

Satyam NEWS

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

Satyam NEWS

ఆన్ లైన్ క్లాస్ లపై సెక్టోరియల్ అధికారి తనిఖీలు

Satyam NEWS

Leave a Comment