33.2 C
Hyderabad
April 26, 2024 02: 16 AM
Slider కవి ప్రపంచం

మనిషికి రెండు వైపులా

#Sudha Sekhar Inampudi (USA)

ఆకలితీరక ఒకడి ఆరాటం

తిన్నది అరిగేందుకు మరొకరు ఉబలాటం

జీవం తీసేందుకు ఒకడి అహంకారం

ప్రాణం కోసం ఇంకొకడి పోరాటం

చేసేందుకు పనిలేక మరొకడి ఆవేదన

మానవ ఆలోచనల మధ్య సంఘర్షణ

అంతా సంక్షోభ మయం

లోకమంతా సందిగ్ధ మయం

అయినా రాజకీయాలే ఈ సమాజంలో

ఎటు పోతుంది ఈ మానవ ప్రపంచం?

వైరస్ సోకింది మనిషికా? మానవత్వానికా?

ఇప్పుడిక శుభ్రపరచాల్సింది మన చేతుల్ని శరీరాన్ని కాదు

మలినమైన ఈ మానవ మస్తిష్కాల్ని, మనసుల్ని

సుధా శేఖర్ ఐనంపూడి (అమెరికా)

Related posts

అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులవుతున్న నేతలు

Satyam NEWS

క్రీడల కారణంగా స్నేహభావం పెంపొందుతుంది

Satyam NEWS

కళ్యాణదుర్గంలో టీడీపీ సానుభూతిపరుడి ఇల్లు కూల్చివేత

Satyam NEWS

Leave a Comment