38.2 C
Hyderabad
April 25, 2024 12: 08 PM
Slider కవి ప్రపంచం

బోనాల పండుగ

#Giddi Venkata Ramana

తెలంగాణ లో  బోనాల పండుగ

పోచమ్మ తల్లికి జరిగే గొప్ప వేడుక

అట్టహాసం గా, ఆర్భాటం గా జరిగే పండుగ

జనమంతా భక్తి శ్రద్ధలతో జరిపే పండుగ!!

అన్నీ కులాల ప్రజలు ఏకమై జరిపే పండుగ

సమైక్యత స్పూర్తి ని చాటే బోనాల పండుగ

తొమ్మిది కుండలలో అన్నం వండే పండుగ

కుండకు సున్నం పూసి,పసుపు రాసే పండుగ

కుండకు వేపాకులు కట్టి పైన మూత పెట్టే పండుగ

మూత పై పే డ పిడక పెట్టి నిప్పు పెట్టే పండుగ

పిడ క మండు తుంటే తల పై పెట్టుకొనే పండుగ

తల పై కుండను పెట్టుకొని గుడి కి వెళ్ళే పండుగ

దేవతకు  కల్లు,మాంసం  సమర్పించే పండుగ

జమ దిక ” తో పంబల వాళ్ళు వచ్చే పండుగ

పంబల వాళ్ళు ఆడుతూ పాడుతూ వుండే పండుగ

అమ్మ వారిని పొగడుతూ తిడుతూ వుండే పండుగ

కుండలో కొంత అన్నాన్ని కాకులకు పెట్టే పండుగ

మిగిలిన దానిని ప్రసాదం గా స్వీకరించే పండుగ

చివర రోజు అమ్మకి చీర రవిక సమర్పించే పండుగ

వ్యాధులు రాకుండ కాపాడమని వేడు కొనే పండుగ

-ఆచార్య గిడ్డి వెంకట రమణ, చరవాణి 9440984416

Related posts

జర్నలిస్టులపై దాడులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు

Bhavani

నేలకొండపల్లి కి పర్యాటక కళ రావాలి

Bhavani

బీజేపీలో పెద్ద ఎత్తున చేరిన గ్రామీణ యువకులు

Satyam NEWS

Leave a Comment