35.2 C
Hyderabad
April 24, 2024 13: 11 PM
Slider కవి ప్రపంచం

బోనాల వైభోగం

#T.Samyuktha Krishnamurthy

భారతీయత సంస్కార రత్నం

తెలుగు తేజం రాష్ట్ర వైభవం

వనదేవతల పూజ మన ఆచారం

వనదేవతలకు ప్రీతికరం బోనం

అదే మన తెలంగాణకు వైభోగం

అమ్మకు బోనాల పండుగ

బోనంతోనే ప్రారంభం

బోనంతోని మగువలం

వెళ్లినం జాతరకు ఆలయం

అక్కడ జాతర ప్రాంగణం

పోతురాజుల విన్యాసం

తాకుతుంది అంబరం

అమ్మకు పిల్లమందరం

చేస్తాము వందనం

ఇంట్లో అంత సంబరం

ఊరు వాడ  అందరం

కలిసి చేస్తాం ఉత్సవం

అమ్మకు బోనం చేస్తాం

కళ్ళు ,శాక పోస్తాం

అమ్మకు చీరెలు పెడతాం

అమ్మ  దీవెనలు  పొందుతాం

అమ్మకు రంగం సిద్ధం

పచ్చి కుండే ఆధారం

భవిష్యత్తు వినేందుకు జనం

అమ్మ నవ్వుల పలికే శాంతం

అమ్మకు కానుకల సమర్పణం

సంతోషంగా అమ్మ దర్శనం

అమ్మ చల్లని చూపే ప్రాణం.

-టి. సంయుక్తా కృష్ణమూర్తి, MCA.,M.ED, కరీమబాద్, వరంగల్ జిల్లా

Related posts

అధిక వర్షాల వలన నష్టపోయిన  రైతులను ఆదుకోవాలి

Murali Krishna

స్వామి వివేకానంద స్పూర్తితో యువకులారా మేల్కొండి

Satyam NEWS

తరగతులకు అన్ని ఏర్పాట్లు చేయాలి

Bhavani

Leave a Comment