37.2 C
Hyderabad
April 18, 2024 22: 40 PM
Slider కవి ప్రపంచం

టికానా లేనోళ్లం

#P V Chandan rao Nizamabad

ముందు వెనకా చూడకుండా నది ప్రవహించినట్లే మేం

నడిచిపోతాం..

మేం నడిచినంత మేర

మేము కట్టిన

స్వర్గాలే

మావికాని స్వర్గాలే…

ఇటుకలు ఇటుకలుగా

సిమెంటు సిమెంటుగా

ఇనుప చువ్వల మోపులతో

స్వర్గ నగరాలను

నిర్మించేది మేమే !

ఎక్కడ మా పేరు ఉండదు

ఉండాల్సిన

అవసరం కూడా లేదు

మూడు పూటల ఆకలి

కడుపులో లొల్లి సేయకుంటే

అదే కోట్ల సంతోషం మాకు

పాడుకాలం వస్తే

మమ్ముల కాపాడాల్సిందెవరు

మీదున్న దేవుళ్ళా

ఔను

ఆకలైనప్పుడు

బుక్కెడు బువ్వ పెట్టె వాళ్ళేకదా

బూలోకపు దేవుళ్ళు…

వలసతనం మా వారసత్వం

చంకలో పిల్లలు

నెత్తి మీద బరువుల ముల్లెలు

టికానా లేని తోవ

జనాభా లెక్కల్లో

పేరుకే ఉన్న వాళ్లం

దేశాన్ని కడుతున్న వాళ్లం

బతుకుల అతుకులను

మసక కండ్లతో

కుడుతున్న వాళ్లం

నిత్తెం కూలిపోతున్న వాళ్లం

లోపల్లోపల

కుమిలిపోతున్న వాళ్ళం

కూలీ నాలిజేసుక బత్కెటోళ్లం

యాడనించో కడుపు సేతపట్కొని

బత్కటానికొచ్చినం కాని

ఏదో పురుగు పగబట్టిందని ఇని

సాపతుక్కు..చిల్లులుబడ్డ బకెట్

పిల్లల్ని సంకనేసుకొని

ఎర్రటెండల

కాల్లకు చెప్పుల్లేకుండా

యాడనో ఉన్న మా ఊరికిి

బొబ్బలెక్కి పుండ్లుపడ్డ కాళ్లతో

నడుసుకుంటు పోతున్నం

యాడున్నా

రెక్కాడాతేగాని డొక్కాడనోళ్లం

ఈ కష్టం మా ఊళ్లనేజేస్కుంటం

కారమన్నమైనా తిని బత్కుతం

మా ఊరు మాకు బంగారం…

– వి పి. చందన్ రావు, నిజామాబాద్, 94400 38565

Related posts

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన కేసీఆర్

Satyam NEWS

నాగలి పట్టి దుక్కి దున్నిన మంత్రి అల్లోల

Satyam NEWS

ఈ నెల 7న ” కీచ‌క సంహారం – నారీ నీరాజ‌నం ”

Satyam NEWS

Leave a Comment