30.7 C
Hyderabad
April 24, 2024 00: 15 AM
Slider కవి ప్రపంచం

రామచంద్రుని రాయబారి

#Viswika Secunderabad

పలికెడిది భాగవతమనియు

పలికించెడివాడు

రామ భద్రుండనియు తెలిపిన

వినయ సంపన్న సహజ పాండిత్యుడు

పోతనామాత్యుడు

వ్యాస విరచితమైన

సంస్కృత భాగవతమును

ఆంధ్రీకరించిన పునీతుడు

భగినీ దండకము

తొట్టతెలుగు దండకంగా విరిసెను

నారాయణ శతకం నవవిధ

భక్తి మార్గాల ముక్తి దాయకము

దక్షయజ్ఞ మందు శివుని పరాక్రమము

తెలిపిన వీరభద్ర విజయము

మంగళసూత్ర వైశిష్ట్యాన్ని

విశదపరిచిన అద్భుత కావ్యము

సజీవ పాత్రల చిత్రణ లోకోత్తర భావుక శక్తి

అద్భుత కథా కథన శిల్పాలు

భక్తి మాధుర్యాలు వీరి శైలీసాధనాలు

మహత్వ కవిత్వ పటుత్వ సంపదలకై

అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కోరిన

భక్తి చతురాననుడు

ఆటవెలది ఛందస్సులో జనుల

రంజింపచేసిన పద్యాలు

శబ్దాలంకార ప్రియత్వాలు

రాజభోగాలు కెన్నడు చేయిచాచని అభిమానధనుడు

ఒక చేత హలమును మరో చేత కలమును చేబూని భగవన్నామ  క్షేత్రాన సుమధుర

కావ్య సేద్యం చేసిన సవ్యసాచి

ఊరక రారు మహాత్ములు అని చెప్పిన రామచంద్రుని రాయబారి

భావ సంతృప్తి భవ సంతృప్తి పొందిన పుణ్యజీవి

( పోతనామాత్యుని గూర్చి కవిత)

విశ్వైక, సికింద్రాబాదు

Related posts

ఓ రైతు, పాస్ బుక్ సమస్య, ఒక పెట్రోలు బాటిల్

Satyam NEWS

డిసెంబర్‌ 2న వస్తున్న ‘బురేవి’ 5న రాబోయే ‘టకేటి’

Satyam NEWS

వరద బాధిత ఆదివాసీలను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment