27.7 C
Hyderabad
April 26, 2024 03: 08 AM
Slider కవి ప్రపంచం

పాములపర్తి వారికో పట్టుపోగు

#Penumaka Nageswararao

మౌన చక్రవర్తిగా  పేరుగాంచిన  పాములపర్తి

ఆర్భాటాలెరుగని అఖండుడు, అనైతికత అంటని  ఉద్దండుడు

విని వినినంతనె వేగపడని ఘటికుడు

బహుభాషా కోవిదుడీ లోపలి మనిషి

అసమ్మతిని,ఆరోపణల్ని అవలీలగా అధిగమించిన ధీశాలి

ప్రశంసలకి  పొంగిపోని మౌని, విమర్శలకు కుంగిపోని యోగి

నిర్ణయాలు తీసుకోకపోవటం కూడా ఓ నిర్ణయమేనన్న మేధావి

చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న విరాగి

పండిత ప్రధాని మన దేశ పదవ ప్రధాని

నవోదయ పాఠశాలల రూపకర్త  (పీఠిక) పీ.వీ

భారతదేశపు ఠీవి మన ఈ ఘనాపాఠి

భూ,ఆర్ధిక సంస్కరణలకు  ఆయనే ఆద్యుడు

అనువాదంలోనూ, తన వాదంలోనూ  ప్రావీణ్యుడు

సాహిత్యం లోనూ   సాన్నిహిత్యం లోనూ  ప్రసిద్దుడు

సమాజ  హితం  కోరుకునే  ప్రజాహితుడు

జ్ణానభూమి లో శాశ్వత నిద్ర పోయిన జ్ణాని

పెనుమాక  నాగేశ్వరరావు, గుంటూరు-522004, సెల్:9441254044

Related posts

టిడ్కో ఇళ్ల పై జగన్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు

Satyam NEWS

నల్లగార్లపాడు రోడ్డు మరమ్మత్తులకై నిరసన దీక్ష చేపడతాం

Satyam NEWS

సుదీర్ఘమైన సేవలతో పోలీసుశాఖకు వెన్నెముకగా నిలిచిన వారికి వీడ్కోలు

Satyam NEWS

Leave a Comment