34.2 C
Hyderabad
May 19, 2025 16: 59 PM
Slider కవి ప్రపంచం

నా దారి అటువైపే…….

#K.Harinath

ఆకుపచ్చని తనాలను కోరుకుంటే

కాంక్రీట్ శిధిల దృశ్యాలు దర్శనమిస్తున్నాయి

శ్రమైక జీవన సౌందర్యాలను వీక్షించాలనుకుంటే

కొత్త కొత్త వైరస్ దాడుల రోగాలు వికృతంగా

వికటాట్టహాసం చేస్తున్నాయి

అడవి మల్లెల నవ్వులు కావాలనుకుంటే

నల్లమలలపై దుష్టశక్తుల డేగకళ్ళు

ధ్వజమెత్తి విన్యాసం చేస్తున్నాయి

పచ్చని పంట పొలాలు చూడాలనుకుంటే

ఎడారి భూములు వెక్కిరిస్తున్నాయి

ఛిద్రమైన వలస బతుకులు

చిగురించని కొత్త చిగుళ్లు

నిలువెత్తు దేవుళ్ళు కొలువైన కోవెలలు

దర్శించుకుందామంటే

వెలవెల బోయి వెక్కిరిస్తున్నాయి

చదువులమ్మ తల్లి వొడిలో బడిలో

గురువుల నీడలో చదువుకుందామంటే

పాఠశాల ప్రాంగణాలన్నీ

లాక్ డౌన్ తాళాలతో పరిహసిస్తున్నాయి

జలధారలతో పుడమి పులకిస్తుందనుకుంటే

కన్నీటిధారలు వరదలై చెలరేగుతున్నాయి

ప్రస్తుత ధరిత్రి చరిత్ర పఠిస్తుంటే

‘కరోనా ‘ కడగండ్లు

ఇప్పుడు ఉదయాలు కరువై

అంధకారంలో హృదయాలు అలమటిస్తున్నాయి

ఉరుకులు పరుగులతో పడమటి పయనాలు

డాలర్లతో తూకమేసుకుంటున్ప జన ప్రవాహాలు

ఎవేవో మస్తిష్కంలో దూరి విస్పోటనం చెందుతూ

నిన్నటి బంధాల్ని బంధుత్వాన్ని, స్నేహవారధుల్పి

లోలోపల గాయాలు చేస్తూ

నిలువునా కూల్చేస్తున్నాయి

కదిలే కాలాన్ని ఇదేమని ప్రశ్నిస్తే

ఇది వైరస్ మహామారి మాయరోగ

మాస్కుల కాలమని

మానవ బంధాలు మృగ్యమని సెలవిస్తుంది

ఇప్పుడు నాకు నవ్యత్వం కావాలి

నవ్యత్వం అంటే………

మానవత్వం పరిమళించే దిశగా

సమాజ గమనం సాగాలి

నా దారి  అటువైపే ……

కె.హరనాథ్

9703542598

Related posts

కుమార్ ను పరామర్శించిన బాదం ప్రవీణ్

Satyam NEWS

ట్రాజెడీ:రోడ్డు ప్రమాదంలో పోలీసు అధికారి మృతి

Satyam NEWS

సంక్షేమంతో బాటు ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి పనులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!