39.2 C
Hyderabad
March 28, 2024 13: 39 PM
కవి ప్రపంచం

పి.వి. మన ఠీవి

#Gorrepati Sreenu

“డిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే”

అంటూ తెలియజెప్పిన తెలుగు తల్లి ముద్దుబిడ్డడు పి.వి!

సాధారణ శాసన సభ్యుడు నుండి రాష్ట్రమంత్రిగా,

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రిగా ,

దేశ ప్రధానమంత్రి గా పలు పదవులు చేపట్టిన ఘనుడు పి.వి.!

మైనారిటి లో వున్న ప్రభుత్వాన్ని తన పాలనాదక్షతతో

ఐదేళ్ళు దేశాన్నిపరిపాలించిన  రాజనీతి చతురుడు పి.వి!

దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో వున్న సమయం లో

ఆర్థిక సంస్కరణలెన్నో ప్రవేశపెట్టి

భారతదేశాన్ని ప్రగతిపథం లో నడిపించిన మేధాసంపన్నుడు పి.వి!

విశ్వనాథ సత్యనారాయణ “వేయిపడగలు “రచన ని

“సహస్రఫణ్” పేరుతో హిందీలోకి అనువాదం చేసి

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న బహుభాషాకోవిదుడు పి.వి!

మనందరికి పి.వి గా పరిచయమైన పాములపర్తి వెంకట నరసింహారావు పుట్టింది

నేటి తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి అనే చిన్నిగ్రామంలో!

పుట్టింది పల్లెటూరులోనే అయినా దేశ రాజధాని కి చేరి

దేశచరిత్ర లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించుకున్న

మహోన్నత మానవతా మూర్తి మన పి.వి!

“పి.వి. మన ఠీవి” అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న

శతజయంత్యుత్సవాలు మనం వారికి  అందించే ఘననివాళి !

– గొర్రెపాటి శ్రీను( 9652832290 )

Related posts

యువతీ యువకులారా

Satyam NEWS

ఆర్ధిక యోధుడు

Satyam NEWS

రాఖీ ఎలా కడతావు సోదరి?

Satyam NEWS

Leave a Comment