37.2 C
Hyderabad
March 28, 2024 20: 54 PM
కవి ప్రపంచం

రాధా మాధవ

#Laxmi Madan

చల్ల చల్లగా వీచేను చక్కని గాలి

మెల్లే మెల్లగ మల్లెల పరిమళం

రావేలా నను చేర కృష్ణా!

యమునా తటిలో నీకై వేచి చూస్తూ

నిలువ జాలను క్షణమైనా

రావేలా నను చేర కృష్ణా

అలదిన గంధం ఆవిరి కాగా

ముడిచిన మల్లెలు వసి వాడి పోయె

రావేలా నను చేర కృష్ణా

వేచిన కన్నులు బరువుగా మూసితి

కాటుక కరిగి మసి బారి పోయె

రావేలా నను చేర కృష్ణా

వెన్నెల కరిగెను మంచు వోలె

ముకుళించే మనసు వేదనగా

రావేలా నను చేర కృష్ణా

నీ అడుగుల సడి వింటి

పులకించే నీ రాధ హృదయం

రావేలా నను చేర కృష్ణా

లక్ష్మి మదన్, హైదరాబాద్

Related posts

లోపలి మనిషి!

Satyam NEWS

లొల్లి

Satyam NEWS

మన దాదా

Satyam NEWS

Leave a Comment