35.2 C
Hyderabad
April 20, 2024 16: 47 PM
కవి ప్రపంచం

ధీరుడితడు

#Durgi Shravankumar

సీ. పదిహేడు భాషలు పట్టుగా సాధించి

భాషలోని ఘనత బయట పెట్టి

సాహితీ కృషియందు సమరమే నడిపించి

వేయి పడగల తీరు విశద పరిచి

అబల జీవితమును యనువాదమొనరించి

లోపలి మనిషిలో లోతు జెప్పి

తెలంగాణ పోరులో తెలియజెప్పెను నాడు

గొల్లరామవ్వను గూర్చె కథగ

తే.గీ. ఆంగ్ల భాషలో రచనల ననువదించి

కలము పేరును విజయగా బలమునొంది 

వ్యాసముల చేత తన రీతి వ్యవహరించి

దివ్య ప్రభలతో దివికేగె తెలుగు రేడు.

సీ. తెలగాణ ప్రాంతాన తెలుగువాడై పుట్టి

వంగర గ్రామాన వరలినాడు

పిన్న వయసులోనె పీవీగ పేరొంది

నైజాము సర్కారు నడ్డి విరచె

విద్యార్ధి దశయందు వేరు ప్రాంతము వెళ్ళి

విద్యనార్జించిన విజ్ఞుడితడు

స్వాతంత్ర్య సమరాన సజ్జన చెలిమితో

పోరాట పఠిమను పొటమరించె

తే.గీ.రాజకీయము నడిపి రాష్ట్రమ్ము నేలె

కొత్త భాషలు నేర్చిన  కోవిదుండు

న్యాయ వృత్తిని చేపట్టె నరవరుండు

దేశ భవితను మార్చిన ధీరుడితడు.

దుర్గి శ్రవణ్ కుమార్

Related posts

విత్తు కాంక్ష

Satyam NEWS

బోనం

Satyam NEWS

విశ్వ మానవ వీణ మీద..

Satyam NEWS

Leave a Comment