24.7 C
Hyderabad
March 29, 2024 06: 32 AM
కవి ప్రపంచం

పోరాటం కొనసాగించు

#Dr.Sammeta Vijaya

స్వతంత్ర భారతం సైతం

కరోనాతో సతమతమవుతున్న వేళ

ముసుగులతో ఊపిరాడని అవనికి

తిరిగి స్వేచ్ఛ కావాలి

అలనాడు దేశం కోసం

పోరాడిన నాయకులెందరో

కరోనా రహిత దేశంకోసం

మరెందరో కదం ముందుకు  కదపాలి

వందేమాతరనినాదం మేలుకొల్పినట్లే

వందే భారతం ఆరోగ్యగీతికలు

అంతటా వెల్లి విరియాలి

పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ

భౌతికదూరాన్నిపాటిస్తూ

కరోనాతో యుద్ధం చేసేందుకు

ప్రతిపౌరుడు సైనికుడవ్వాలి

గాంధీ నెహ్రూ సుభాష్ నాయకుల

నిబద్ధతను గుండెలలో నింపుకుని

దేశాన్ని కాపాడే దీక్షమనదవ్వాలి

నిరంతర సేవల ధన్వంతరులకు

నిజాయితీగా నిలిచిన రక్షకసిబ్బందికి

ప్రతిరోజు పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకి

సహాయ సహకారం అందిస్తూ

స్వీయ సంరక్షణ పాటిస్తూ

నీవంతు కర్తవ్యం నిర్వహించు

కరోనా విముక్త స్వాతంత్య్రం సాధించు

డా. సమ్మెట విజయ

Related posts

సరికొత్త కాంతి

Satyam NEWS

బోనాలు

Satyam NEWS

క్షీర సాగర మధన సారం

Satyam NEWS

Leave a Comment