37.2 C
Hyderabad
April 18, 2024 20: 41 PM
కవి ప్రపంచం

జెండా ఎజెండా….

#Sailaja Mitra

చాలా ఏళ్లుగా నా చూపులు

దేశ చిత్రపటాన్ని చూస్తున్నాయి

నా జెండా

దేశానికి వచ్చి చాలా కాలమైంది

గడచిన జ్ఞాపకాల్ని

తనకోసం జరిగిన పోరాటాల్ని తలుచుకుంటూ

రెప రెప లాడటంలో పుష్పాలతో పాటు 

కన్నీటి భాష్పాలను  కూడా రాల్చుతోంది 

ఇప్పుడు నా గుండె

మూడు రంగుల పై కూర్చుని ఆలోచిస్తోంది

రంగుల ఆంతర్యాన్ని నెమరేసుకుంటోంది 

తెలుపు మాసిపోయింది

కాషాయం గోడమీది పిల్లిగా మారిపోయింది

ఆకుపచ్చ అలసిపోయి  సేదతీరుతోంది

పోరాడే జెండాలన్నీ

ప్రస్తుతం పహారా కాస్తున్నాయి

అవి రెక్కలు తగిలించుకుని ఎగిరే ప్రయత్నం లో ఉన్నాయి

నిలదీసే గొంతులన్నీ సంకెళ్లను ఆశ్రయించి

న్యాయం కోసం ఆకాశాన్ని చూస్తున్నాయి

ఒకప్పటి పోరాట వీరుల గుర్తులన్నీ

చరిత్ర కోసం గోడలకు వేలాడుతున్నాయి

మన జీవితాలకు అద్దిన అనురాగ పరిమళం

ఇంకా అప్పుడప్పుడు వీస్తూనే ఉంది

ఎవరి గోల వాడిదనే సమాజానికి

జెండా కింద నిలబడి సెల్యూట్ చేయడం

రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది

కాస్త ఎక్కువ కష్టమే  మరి ..

ఏమైనా జెండా చర్చలకు వేదికైంది

విసిగిపోయిన జనాలకు సంబరాల రోజయ్యింది

కవులకు గుంపు ఫోటో గా మిగిలింది

కళాకారులకు పలకరింతల పాలపుంత అయింది

ఇప్పుడు ఎగురుతున్న అనేక జెండాల మధ్య

జాతీయ జెండా తన ఎజెండా మర్చిపోయింది

రావడం తెలుసును కానీ

వదిలి వెళ్లడం ఇష్టం లేక అన్నిటితో పాటు

ఆనందంగా ఎగరడం నేర్చుకుంది

శైలజామిత్ర, హైదరాబాద్

Related posts

సరదాల సంక్రాంతి

Satyam NEWS

ఆత్మీయ బంధం

Satyam NEWS

అభివందనం

Satyam NEWS

Leave a Comment