32.2 C
Hyderabad
March 28, 2024 22: 50 PM
కవి ప్రపంచం

నా దేశ పతాకమా

#Manjula Surya New

ఎగిరే పతాకమా

అనుభవాల సారమా

నా దేశ పతాకమా నన్ను నడిపించే సాధనమా

విప్లవ పోరాటాలకు ప్రత్యక్ష సాక్షమా

బానిసత్వానికి ఎదురీదిన ధీరోదాత్తమా

శాంతి సహనాన్ని కనుల ద్వయంగా

చేసుకున్న ఆశయ సాధనమా

ఎందరో యోధులకు పోరాట పౌరుషాన్ని

రగిలించిన విప్లవ శంఖారావమా

అసువులు బాసిన సమర వీరులను

చిరస్మరణీయులుగా  చేసిన జ్ఞాపకమా

చొరబాటుదారులను తోకముడిచేలా

చేసిన గర్జించే వ్యాఘ్రమా

ఎదిగే దశలను గడ్డు కాలాలనూ

ఒకేలా చూసిన పరిపూర్ణ మూర్తిమత్వమా

ప్రపంచం ముంగిట్లో దేశ గౌరవాన్ని

ఇనుమడించేలా చేసిన కీర్తికిరీటమా

కుల మతాలకు అతీతంగా అందరినీ

ఒకటిగా చూసిన లౌకికవాద నినాదమా

ఎన్ని సంక్షోభాలు ఎదురైనా దేశాన్ని

ముక్కలవకుండా కలిపి ఉంచిన మనోనిబ్బరమా

పిల్లలు పెద్దలకు గుండెలనిండా

దేశభక్తిని నింపుకునేలా చేసే

జాతీయ పర్వదినమా

సూక్ష్మ జీవులైతేనేమి స్థూల దేశాలైతేనేమి

ఎవరికీ లొంగని వంగని సుస్థిర స్థిరచిత్తమా

నీవే మా అహం నీవే మా గర్వం

నీవే మా అభిమానం నీవే మా అధికారం

అందుకో మా వందనాలు

అందరి జేగంట నాదాలు

వినిపించాలి నలుదిశలా

ఈ ప్రభంజనాలు

వెల్లువై సాగాలి దేశభక్తి నీరాజనాలు

జైహింద్

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

అమృతమయి అమ్మ

Satyam NEWS

సింహవాహిని

Satyam NEWS

“నాన్న”

Satyam NEWS

Leave a Comment