38.2 C
Hyderabad
April 25, 2024 12: 02 PM
కవి ప్రపంచం

త్రివర్ణ కేతనం

#K.Veena Reddy

నీలి నింగి రెపరెపల స్వేచ్ఛా విహంగంలా

విజయ వికాస విభాతరంగ విన్యాసంలా

త్రినేత్ర చేతనంలా మన త్రివర్ణ కేతనం

అమరవీర సమరశూర త్యాగఫలం

అజరామర యోగజన తపోబలం

ఉషోదయ రాగంలా ఆ కాషాయ సరాగం!

గగనవీధిలోని హంస గమనంలా

నిష్కళంక చరితగల జన మనం లా

స్వచ్ఛమైన ఆ శ్వేతవర్ణమమలం!

ప్రకృతికి ప్రతిరూపమైన ప్రగతిధనం

జగతికి ప్రాణధనం ఆ(కు)పచ్చదనం!

ఆ నడుమ నడయాడు సుదర్శనం

ధర్మాచరణానికది నిదర్శనం

లోకహిత శోకరహిత అశోక చక్రం!

ఆ మువ్వన్నెల జెండాకు వందనం

కావాలి కరోనా కరిగి బ్రతుకు నందనం!

కె.వీణారెడ్డి

Related posts

పుణ్యధాత్రి

Satyam NEWS

సంబురం

Satyam NEWS

ఉగాది సారాంశం!

Satyam NEWS

Leave a Comment