37.2 C
Hyderabad
April 18, 2024 19: 46 PM
Slider కవి ప్రపంచం

మధుర భాష మన తెలుగు

#Nellutla Sunitha

గిడుగు రామ్మూర్తి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరికీ తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలతో

మానవ మనుగడకు మాతృభాష

మమతానురాగాల మధుర భాష

మల్లెకన్న స్వచ్ఛమైన సుగంధాల భాష!

ఉద్యమాల ఊపిరై సాగిన భాష!

సెలయేటి అలలా పారేటి భాష

జీవనది లా మనకు జీవమై పోసింది

సప్తస్వరాలు పలికించే శ్రావ్యమైన  తెలుగు !

అలంకారాలతో అందంగా వెలిగే

గ్రాంధిక మైన వ్యవహారిక మైన

పలుకుబడుల భాష ప్రావీణ్య భాష

మనసులో భావాలు పలికించే భాష

యాదృచ్చికంగా వచ్చేను భాష

తేనియల భాష నా పాల భాష

పదబంధాల కు ప్రాణమై నిలిచింది

ఎద నుంచి ఎగిసేటి నా మాతృభాష

సప్తవర్ణాల ను తలపించే భాష

భాష ప్రేమికులుగా భువిలోన నిలిచి

అమ్మ భాషను మనము కాపాడుకుందాం

ముందు తరాలకు భాష ఉనికిని చాటుదాం!

నెల్లుట్ల సునీత, ఖమ్మం

Related posts

సంప్రదాయ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలి

Satyam NEWS

సరదాగా ఇంతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Satyam NEWS

పండుగ రోజు కూడా విధుల్లో పోలీసులు…!

Satyam NEWS

Leave a Comment