39.2 C
Hyderabad
April 25, 2024 17: 01 PM
Slider కవి ప్రపంచం

వరదేవతలే వలసకార్మికులు

#Sudhama

కూటికోసం కూలికోసం తరగని తీరాల దారుల వెంట

తరలిపోయిన తల్లిప్రేవులు వలసజీవులు.

కాలపు క్రిమి కాటేసిన కడు దుర్భరవేదనలో-

పనులు లేకా పస్తులతో చస్తూ పట్టణంలో బతకలేక-

ఉన్న ఊళ్లకు తమవారిని చేరాలని ఆశతోటీ, శ్వాసతోటీ

ప్రయాణించే సాధనాలు ఒక్కటయినా అందిరాక –

పాదాలకే భారమేసి నడక…నడక…నడక..నడక..ఒకే నడక

మండుటెండకు మాడిపోతూ, బరువు మూటలు మోసుకుంటూ

పిల్లాపాపల నెత్తుకుంటూ, రోడ్ల వెంటా, రైలుపట్టా బాట వెంటా

ఒకే నడక… ఒకే నడక.. ఆకలితో, నీరసించిన దేహస్థితితో

బతుకు తడబడు… పిడచకట్టిన ప్రాణదాహపు పరుగునడక…

చెమటనూ, రక్తాన్ని తాము దేశప్రగతికి పెట్టుబడిగా

నారువేసిన, నీరుపోసిన, ఇటుక పేర్చి ఇండ్లుకట్టిన

ఫ్యాక్టరీలలో, బొగ్గుగనులలో, నిరంతర నిర్మాణ రంగములలో

శ్రామికులుగా, కార్మికులుగా కష్టబతుకుల వలస జీవులు

శాపగ్రస్తులు కాకపోతే అంటురోగపు వాహకులుగా

వారినే భావించు ధోరణి ప్రబలడం ఒక అమానుషం

ప్రభుత్వాలది దృష్టిదోషం వారి రక్షణ దేశ బాధ్యత

అన్ని రంగముల అన్ని పనులకు పునాదులీ వలసజీవులు

కాలాన్నే జయించి తేగల కార్మిక శక్తికి మన కైమోడ్పులు.

నరదేవతలే వలసకార్మికులు – వందనాలు ఆ నడిచే దేవుళ్లకు.

-సుధామ 9849297958

Related posts

విజయవాడలో రెడ్డిపేట తండా వాసి మిస్సింగ్

Satyam NEWS

కాపు రిజర్వేషన్లపై ప్రాధేయపడుతూ ముద్రగడ లేఖ

Satyam NEWS

జానారెడ్డిని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదు

Satyam NEWS

Leave a Comment