39.2 C
Hyderabad
April 25, 2024 17: 54 PM
Slider కవి ప్రపంచం

గురుదేవులారా…….

#K.Harinath

సరస్వతిని వశపరచి

బృహస్పతిగ మలచిన

గురుధ్వజ దిగ్గజములారా……

నిరంతరము యంత్రమువోలె

విరామమెరుగక శ్రమించే

అనంత సేవాభావ

కిరణాలు మీరేకదా……

చదువుల తల్లి ఒడిలో

చదువుతో పాటు

సంస్కార ఓంకారము దిద్దించి

భావిభారత పౌరులుగ మలచి

నీతినియమాల ఖ్యాతికి

రూపురేఖలు దిద్దిన ఘనత

గురువులైన మీకే కదా……

విభిన్న రంగాలలో

సాటిలేని ప్రతిభకు పట్టంకట్టి

యువకులకు మార్గదర్శకులైన

మీ వాక్చాతుర్య పిపాస అపారం

మానవత్వపు విలువలకు

మణిహారాలై నిలచిన

ఓ ….గురుదేవులారా

వందనాలు..వందనాలు..వందనాలు

(5,సెప్టెంబరు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా)

కె.హరనాధ్

Related posts

అధికార దూతగా వచ్చారా? అసమ్మతి నేతగా వచ్చారా?

Satyam NEWS

వనపర్తిలో జిల్లా పోలీస్ కార్యాలయం భవనం ప్రారంభం

Satyam NEWS

ఒకే ఒక్కడు

Satyam NEWS

Leave a Comment