37.2 C
Hyderabad
March 29, 2024 17: 17 PM
Slider కవి ప్రపంచం

తోటమాలి

#Manjula Surya New

జ్ఞానమే పెట్టుబడిగా

బోధనయే ధనముగా

మస్తిష్కమనే పొలాన్ని దున్నుతూ

చిన్ని విత్తనాలను ఎత్తుకు ఎదిగేట్టు చేయుటే లక్ష్యంగా

అనుభవసారమునే సారముగా చేసి

అజ్ఞానమనే కలుపుమొక్కల్ని ఏరివేసి

నిత్య నూతన విషయాలను కొంగ్రొత్తగా

పరిచయం చేసి

కరుగుతున్న కాలంలో ఉషోదయపు సూర్యుడిలా ప్రభవించేట్టు చేసి

పెరిగే ప్రతి దశను గమనిస్తూ

మెరుగయ్యేందుకు సూచనలందిస్తూ

విరిసే విరులను చూసి ఆత్మ సంతృప్తిని పొందుతూ

విలువలనే కంచెతో కట్టడి చేస్తూ

తిరుగులేని తరువుగా

బెరుకులేని భావిభారత పౌరుడిగా

ప్రపంచానికి పరిచయం చేసిన

గురువుకు వందనం

అభివందనం

మరిచిపోలేని మా మంచి మాష్టారుకి

ఇదే నా కవితా నీరాజనం

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

చిరంజీవి-సల్మాన్ ఖాన్‌ల మెగా మాస్ ప్రభంజనం

Satyam NEWS

పర్మినెంట్ చేసే వరకు ఆందోళన చేస్తాం: సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి

Satyam NEWS

శ్రీ ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి వారికి రధం

Satyam NEWS

Leave a Comment