33.2 C
Hyderabad
April 26, 2024 02: 34 AM
Slider కవి ప్రపంచం

వందన సమర్పణ

#PVS Krishnakumari

నవ జీవన విధానానికి

పటిష్ఠమైన , ఆరోగ్య కరమైన

పునాదులు వేసే మార్గదర్శకులైన

గురువులందరికీ వందనం..

అఙ్ఞాన తిమిరాలను సంహరించి

తమ బోధనల ద్వారా

విఙ్ఞాన కిరణాలను వెదజల్లుతూ

జగత్తు కంతటికీ వెలుగును పంచే

దైవ స్వరూపులైనటువంటి

గురువులందరికీ వందనం

తాను నాటిన విద్యాబీజాలు

మొలకలెత్తి మహా వృక్షాలు కాగా

వాటి అమృత ఫలాలను మనకే వదిలేసే

త్యాగమూర్తులైన

ఉపాధ్యాయులందరికీ వందనం

పెరుగు చిలికి వెన్నను తీసినట్లు

పిల్లల లోని సృజనాత్మకతను శోధించి

కొత్త ఆవిష్కరణలకు

అంకురార్పణ చేసేశోధకులైన

ఉపాధ్యాయులందరికీ వందనం

అధ్యాపక వృత్తికి మహోన్నత

గుర్తింపు తెచ్చిన

సర్వేపల్లి రాధాకృష్ణన్

అడుగుజాడల్లో నడిచే

ప్రతి ఒక్క  ఉపాధ్యాయుడికి

శత సహస్ర కోటి వందనాలు

పీ.వి.యస్. కృష్ణ కుమారి

Related posts

అమరావతి కోసం తెలుగుదేశం ఆధ్వర్యంలో పాదయాత్ర

Satyam NEWS

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిక

Murali Krishna

రివర్స్ గేర్:కెనాల్ లో కారు పడి దంపతులు మృతి

Satyam NEWS

Leave a Comment