30.7 C
Hyderabad
April 19, 2024 10: 29 AM
Slider కవి ప్రపంచం

ఆచార్యుడు, ఆరాధ్యుడు

#VaddepallySrikrishna

“ఆచార్య దేవోభవ “అన్నది ఆర్యోక్తి

ఆ ఆర్యోక్తి నీ అక్షరాలా ఆదరించి

ఆచరించే విద్యార్థులకు లభిస్తుంది జ్ఞాన ప్రాప్తి

కని, పెంచే శైశవంలో తల్లియే ప్రథమ దైవం

తప్పటడుగుల బాల్యంలో తండ్రియే ద్వితీయ దైవం

జ్ఞానార్జన కౌమార్యం లో గురువుయే తృతీయ దైవం

పాలిస్తూ, గోరుముద్దలు తినిపిస్తూ

పసి ప్రాయం లో తప్పటడుగులు నేర్పిస్తుంది తల్లి

పడిపోకుండా మెప్పుటడుగులు వేయిస్తాడు తండ్రి

ఆ తర్వాత పాఠశాల లో

పలు పాఠాల్ని బోధిస్తూ

ప్రపంచ జ్ఞానాన్ని కలుగజేస్తూ

బ్రతుకు తెరువు కు అనువైన

బాటల్నిచూపుతాడు గురువు

ఎవ్వరూ దోచుకోలేని

ఎనలేని విద్యానిధిని అంద జేస్తాడు గురువు

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా

సగర్వంగా జీవించేలా

ఉద్యోగం సాధించేలా

ఉపయోగపడుతాడు గురువు

అందుకే ఆయన ఆచార్యుడు

అందరికీ ఆరాధ్యుడు…

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, ఫోన్: 9246541699

Related posts

జమాత్ ఉల్ ముజాహిద్దీన్ పై ఎన్ఐఏ దాడులు

Bhavani

పేరేచర్ల లో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

Satyam NEWS

పుష్పపల్లకీపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌నం

Satyam NEWS

Leave a Comment