39.2 C
Hyderabad
April 25, 2024 16: 11 PM
కవి ప్రపంచం

మేరు నగ ధీరుడు

#Purimalla Sunanda Khammam

ఆ పేరు వింటే చాలు

తెలుగు తల్లి హృదయం పులకిస్తుంది!

భరత మాత తన కిరీటంలో కలికి తురాయని మురుస్తుంది!

ఖండాంతరాల్లో  ఖ్యాతి పతాక నెగరేసి

ప్రపంచ యవనికపై ఠీవిగా తన పేరును

సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మహా మేధావి పీవీ!

బహు ప్రక్రియల సాహితీ సుగంధాలతో పరిమళిస్తూ

భాషల పూదోటలో విరిసిన

అరుదైన జ్ఞాన పుష్పం!

ఒడుదుడుకులకు వెరవని స్థితప్రజ్ఞుడై

అస్తవ్యస్త ప్రజాస్వామ్యంలోని

లోటుపాట్లను చక్కదిద్దిన

అపర చాణక్యుడు!

దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఒడ్డుకు చేర్చిన అసామాన్యుడు!

భవిష్యత్తును ప్రగతి పథంలోకి నడిపించిన మేరు నగ ధీరుడు!

దక్షిణ భారత ప్రధానిగా

ఢిల్లీ పీఠాన్ని అలంకరించిన

పాముల పర్తి వేంకట నరసింహారావు!

మిత భాషణ మందస్మితుడై దేనికి చలించని సమున్నత వ్యక్తిత్వంతో

రాజకీయ ఋషిగా పేరొందిన పీవీ!

సంగీత సాహిత్య సవ్యసాచి

అలతి అలతి పదాలతో స్వీయ

అంతరంగాన్ని ఆవిష్కరించిన ‘లోపలి మనిషి’!

ప్రజల హృదయాన్ని దోచుకున్న

పాముల పర్తి వంశ తిలకుడు

పీవీ నరసింహారావు చిరస్మరణీయుడు!

వురిమళ్ల సునంద, ఖమ్మం

Related posts

ఈ రాత్రిని యిలా గడిచిపోనీ

Satyam NEWS

ఇదే కదా ప్రేమంటే….

Satyam NEWS

బహుముఖ ప్రజ్ఞాశాలి

Satyam NEWS

Leave a Comment