36.2 C
Hyderabad
April 18, 2024 13: 56 PM
కవి ప్రపంచం

జాతి మెచ్చిన మహానేత

#Vavilapally Rajarao

నిజాం  నిరంకుశ పాలన నుంచి తెలంగాణ

విముక్తికి పోరు బాట పట్టిన ధీరుడా

అలుపెరగని వీరుడా

తెలంగాణ గడ్డపై గర్జిచిన సింహమా !

తెలుగు నేల ముఖ్యమంత్రిగా

భూసంస్కరణలు ప్రవేశపెట్టి

ముల్కి నిబంధనలు రద్దుపరచి

బడుగుల బతుకుల్లో జ్యోతి వెలిగించావు !

విశ్వవిఖ్యాత మహానాయకగా

తెలుగు జాతి మణి దీపికగా

భారతమాత రత్నాల బిడ్డగా

జాతి హృదిలో నిలిచాడు పాములపర్తి!

పదహారు భాషల పండిత ప్రకండ

న్యాయ శాస్త్ర పండిత భాస్కర

విజ్ఞానివై మహాజ్ఞానివై ఏకసంధాగ్రహీతగా

నిలిపావు దేశ ఖ్యాతిని వినువీథుల్లో !

ఆర్థిక సంస్కరణల పితామహునిగా

దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపావు

జగతిలో జాతి గౌరవం నిలిపావు

దేశ నాయిక గణంలో  ఆణిముత్యమై వెలిశావు !

వావిలిపల్లి రాజారావు, పొందూరు, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, చలన భాషిణి 9963606391

Related posts

ఉద్వేగ గళోద్దీపన దరువు

Satyam NEWS

నీళ్ళాట – ఓ జీవన చక్రం

Satyam NEWS

ప్రశ్నించుకో

Satyam NEWS

Leave a Comment