32.2 C
Hyderabad
March 28, 2024 22: 23 PM
కవి ప్రపంచం

ప్రతిభాశాలి

#Gollamudi Padmavathi

స్వాతంత్ర్యోద్యమ వీరుడు

దేశ ప్రగతి దార్శనికుడు

నిరాడంబర నిగర్వి

అసమాన ప్రతిభాశాలి

ఆంధ్రుల అభిమానం, ఠీవి

మన తొలి తెలుగు ప్రధాని పీ.వి

ఉత్త మాటలు కాక చేతల మనిషి

అచంచలమైన విశ్వాసంతో

అమలుపరచెను ఆర్ధిక సంస్కరణలు

నడిపెను దేశాన్ని ప్రగతి పధాన

ఉన్నతోన్నత ప్రతిభావంతుడు

మన పాములపర్తి నరసింహుడు

హోంశాఖామాత్యుడుగా

విదేశీ వ్యవహారాల మంత్రిగా

ధీటుగా వ్యవహరించిన ధీశాలి

తీవ్రవాదాన్ని తిప్పికొట్టిన తెంపరి

రచయిత , పండితుడు

బహుభాషా కోవిదుడు

తెలుగునేలప్రతిభకు నిలువెత్తు

నిదర్శనం

దేశానికే శ్రీరామరక్ష అయింది

పి.వి. ప్రధాన మంత్రిత్వం

జయహో జయహో పి.వి.

గోళ్ళమూడి పద్మావతి, హైదరాబాద్, సెల్ నెం: 9618895543

Related posts

ఓ మహాయోగి

Satyam NEWS

త్రివర్ణపతాక

Satyam NEWS

ప్రపంచ శాంతి – పంచశీల

Satyam NEWS

Leave a Comment