27.7 C
Hyderabad
April 25, 2024 10: 15 AM
కవి ప్రపంచం

పివి తెలుగు వారి ఠీవి

#Jami Satyanarayana

అనుకోకుండా అదృష్టవశాత్తు అందలమెక్కిన

ఆరిపోతున్న దీపాన్ని వెలిగించినట్లు

కూలిపోతున్న ఆనాటి ప్రభుత్వాన్ని

నిలబెట్టుటలో చూపే నైపుణ్యం అపూర్వం

తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఆర్థిక వ్యవస్థ

తన్నినా చెక్కుచెదరని బలమైన వ్యవస్థగా

మార్చిన దమ్మున్న ఆర్థిక నిపుణుడు నరసింహుడు

తెలుగు వాడు కావడం తెలుగువారికి గర్వకారణం

తెగువ చూపుటలో చాణిక్య వ్యవహారం పి వి కే సాధ్యం

అపర చాణక్యుడిగా ఓ తెలుగువాడు ఎదగడం

అంచనాలను తల్లకిందులుగా తెలివిగా మార్చడం

ఎవరు సాటిరారు ఆనాటి ప్రధాని పీవీ కి

“పివి తెలుగు వారి ఠీవి” అని చెప్పడంలో…

 ఏ విధమైన అతిశయోక్తి లేదనడం వాస్తవం

భారత అత్యున్నత కార్యనిర్వాహక  పదవి నలంకరించడం

ఏకైక తెలుగువాడు కావడం తెలుగువారికి ఎంత ఆనందం!

తెలుగు వారి తెలివిని విశ్వమున నిలిపిన పివి

ధన్య జీవిగా తెలుగువారి గుండెల్లో కొలువైనాడు

అపర చాణక్యుడు పి.వి.నరసింహుడు

జామి సత్యనారాయణ, లక్కవరపుకోట, విజయనగరం జిల్లా, చరవాణి:7013658114

Related posts

పి.వి

Satyam NEWS

సింహవాహిని

Satyam NEWS

ప్రేమంటే

Satyam NEWS

Leave a Comment