28.7 C
Hyderabad
April 24, 2024 06: 46 AM
కవి ప్రపంచం

ఆదర్శ భారతీయుడు

#Dasyam Madhavi

ఓరుగల్లు ముద్దు బిడ్డ

పౌరుషాల తెలుగు బిడ్డ

పి వి నర్సింహా రావు

భరత జాతి గొప్ప బిడ్డ…

నెత్తురంత దేశ భక్తి

సత్తువ కోరగ విముక్తి

నా దేశ భవితంటూ

గాండ్రించెనట పి వి  యుక్తి…

చదివెను న్యాయశాస్త్రం

నడిపె నిజాంపై సమరం

తెలుగు ప్రధానమంత్రై

నిలిపెను విజయ పతాకం…

రాజకీయ మాణిక్యము

అకుంఠిత నాయకత్వము

కపటమెరుగని పి వి ది

చైతన్యపు సారథ్యము…

ఆదర్శ భారతీయుడు

మన్నన నిలిపిన పౌరుడు

విద్వత్తు ఆయన సొత్తు

మన పి వి చరిత్ర కారుడు…

దాస్యం మాధవి, జార్జియా, సెల్ నెం 8008926969

Related posts

మహంకాళి బోనాల పండుగ

Satyam NEWS

సంక్రాంతి సందడి

Satyam NEWS

తొలి మంచు స్వప్నం

Satyam NEWS

Leave a Comment