28.2 C
Hyderabad
April 20, 2024 14: 32 PM
కవి ప్రపంచం

బహుముఖ ప్రజ్ఞాశాలి

#Ravinutala Bharadwaja

ప్రధాని పీఠం యేలిన తెలుగు వాడు ముఖ్యమంత్రిగా యేలిన ఆంధ్రుడు

లక్నె గ్రామాన రుక్నాభాయి సీతారామారావుల ఇంట పుట్టిన పుణ్యపురుషుడు

వంగర గ్రామానికి వెళ్ళాడు దత్తత, వందేమాతరం గీతం పాడి చాటాడు భారతీయత

నాగపూరున పొందాడు యల్ యల్ బి  పట్టా

జర్నలిస్టుగా మారి నేర్చుకున్నాడు బహు భాషల చిట్టా

మంథని నియోజకవర్గం నుండి అసెంబ్లీలో  తొలి అడుగు

ఏ క్షణాన అడుపెట్టాడో గాని  వరించాయి మంత్రి పదవులు

చేరుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి పీఠాలు

ఆయన కాలాన జరిగాయి జై అంధ్రా ఉద్యమాలు

వదిలిపెట్టలేదు గుండె దైర్యాలు

హనుమకొండ నుండి ఎంపికయ్యాడు ఎం.పి గా

ఆయన్ను వదిలిపెట్టలేదు మంత్రి పదవుల గౌరవాలు

రాజీవ్ హత్య అనంతరం వరించింది  ప్రధాని పదవి

తెలుగువాడన్న గౌరవాన ఎవరు పెట్టలేదు  పోటీ

తన రాజకీయ చతురతతో నడిపాడు ప్రభుత్వాన్ని

మైనారిటీ ప్రభుత్వాన్ని  నిలబెట్టి  పొందాడు అపార చాణక్య బిరుదాన్ని

ఇన్ని విమర్శలు ఎదుర్కొన్నా మొక్కవోని దైర్యం ఆయనది

రాజకీయంతో పాటు సాగించాడు సాహిత్యాన్ని

వేయిపడగల కు మొదలుపెట్టాడు అనువాదాలు

అందుకున్నాడు కేంద్ర సాహిత్య అవార్డులు

ఎన్నో కవిత్వాలకు చేసాడు అనువాదం చూపాడు ప్రజ్ఞాపాఠవం

రావినూతల భరద్వాజ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, నందిపురస్కార గ్రహీత,  కొత్తపట్నం, ప్రకాశంజిల్లా

Related posts

ఉద్వేగ గళోద్దీపన దరువు

Satyam NEWS

జగజ్జనని

Satyam NEWS

వ్యాయామం

Satyam NEWS

1 comment

గోపిశెట్టి వెంకటేశ్వరరావు September 16, 2020 at 1:48 PM

రైతు బిడ్డగా జన్మించి సరస్వతి పుత్రుడిగా రాణించి రాజకీయ రణ రంగంలోఅడుగిడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి భారతదేశంలో ప్రప్రథమంగా భూసంసాకర్ణాలు చేపట్టి ప్రతి ఒక్కరు భోజనం చేయాలనే సంకల్పంతో గొప్ప సి ఎం గా పేరుతెచ్చుకున్న తెలంగాణ ఆంధ్రా ఉద్యమాలు వర్గ పోరు రాజకీయాలు ఇబ్బందులకి గురిచేసిన వారి స్థిర రాజకీయాల కేంద్రంలో మంత్రి పదవులు తెచ్చి పెట్టినవి ఇందిరమ్మ రాజీవల ఘోరహత్యాల అనంతరం దేశానికి దిశ దశ నిర్దేశం చేసి ప్ ఎం గా సంస్కరణలు అమలు చేసి భరతమాత ఖ్యాతిని జాతి వెలుగును అందించిన మహానీయుడు మన తెలుగు బిడ్డ దివంగత శ్రీ పి వి నరసింహారావు గారు భారత రత్న అందించాలిసిన సంస్కర్త బహుభాషా కోవిదుడు రాజకీయ చాణిక్యుడు పరిపాలన దక్షుడు మార్గదర్శకుడు ఆదర్శవంతమైన నాయకుడు భరతమాత ముద్దుబిడ్డ మన పి వి టి వి చరిత్రలో చిరస్మరనీయుడు గోపిశెట్టి వెంకటేశ్వరరావు ఉపాద్యాయుడు

Reply

Leave a Comment