30.7 C
Hyderabad
April 19, 2024 08: 53 AM
కవి ప్రపంచం

చైతన్యోర్మి

#Polamarasetti Krishnarao

మనపాములపర్తి

పుట్టింది లక్నేపల్లిలో

పెరిగింది దత్తుడై వంగరలో

చిన్ననాటే నాటుకున్న దేశభక్తి

జ్వలించిన స్వరాజ్య కాంక్షానురక్తి

నిజాం నిరంకుశపాలనపై…

వందేమాతర నిరసనగళంతో

ప్రజాజీవన ప్రస్థానారంభం

దక్షిణభారత్ నుంచి ఎన్నికైన తొలిప్రధాని

దీక్షాదక్షతలున్న తాత్త్విక జ్ఞాని

ఆర్థికసంస్కరణల సంస్కర్త

సరళీకరణలకావిష్కర్త

మౌనమే నా భాషన్న తాపసి

నిశ్శబ్దాన్ని కప్పుకున్న యశస్వి

మన పీవీ…

వ్యక్తిపూజలు, వ్యక్తిత్వ హననాలు తెలీని నియోగి

సిసలైన నిష్కామకర్మయోగి

తెలంగాణా ముద్దు బిడ్డైన మహామనీషి

తెలుగుజాతి కన్న మరోఉక్కు మనిషి

బహుముఖ కోణాల

సమున్నత వ్యక్తిత్వం

భారత ధాత్రి చరిత్రలో

చెరిగిపోని సువర్ణసంతకం.

పొలమరశెట్టి కృష్ణారావు, ఉప్పల్, హైదరాబాద్. సెల్ నెం: 9676544764.

Related posts

జాషువా తత్వం

Satyam NEWS

అంతులేని కథ

Satyam NEWS

అపర చాణక్యుడు!

Satyam NEWS

Leave a Comment