40.2 C
Hyderabad
April 24, 2024 15: 11 PM
కవి ప్రపంచం

నిశ్శబ్ద విప్లవం

#Chokkara Tatarao

ఒళ్ళంతా మౌనం కప్పుకుని పైకి గంభీరంగా కనిపిస్తాడు

భారతదేశ ఔన్నత్యానికి ప్రతీకగా ఢిల్లీ వీధుల్లో

తెలుగుతేజాన్ని చాటిన అపర చాణక్యుడు

ఆర్ధిక సంస్కరణల పితామహుడిగా దేశాన్ని ముందుకు నడిపించిన సంస్కర్త

శాసనసభ్యుడునుండి ముఖ్యమంత్రిదాక

పదవులు చేపట్టి

బలమైన శక్తిగా ఎదిగిన తొలి దక్షిణాది ప్రధాని

నిజాం ప్రభుత్వాన్ని ధిక్కరించి వందేమాతరం గీతం పాడిన ధీశాలి

పట్టణభూగరిష్ట చట్టం తెచ్చిన సంస్కరణవాది

పంజాబు తీవ్రవాదాన్ని ఒంటిచేత్తో అణచిన ఉక్కుమనిషి

ఆర్ధిక వ్యవస్థలోని విప్లవాత్మకమైన సంస్కరణలకు ఆద్యుడు

కుంటుపడిన వ్యవస్థను గాడిన పెట్టిన ఘనుడు

ఒక వ్యక్తికి పదిహేడు భాషల్లో ప్రవేశముందంటే అది పీవీకే చెల్లు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిన వేయిపడగలు

మీ సాహితీ ప్రకర్షకు గీటురాయి

మీ ఆలోచన లోంచి వచ్చిన తెలుగు అకాడమీ నవోదయ పాఠశాలలు

భాష పట్ల మీ కున్న అపార నమ్మకం

అటు రాజకీయం ఇటు సాహితీ సేవ

సమపాళ్ళలో నడిపించిన అపర మేథావి

లోపలి మనిషితో తన ఆత్మకథను పలికించిన మౌన ముని

సంగీతం సినిమా నాటకాలు మీ అభిరుచికి తార్కాణం

పీవీ ఒక వ్యక్తికా దు శక్తి ఒక వ్యవస్థ

ఈ దేశ అభివృద్ధిలో ఒక నిశ్శబ్ద విప్లవం

చొక్కర తాతారావు, విశాఖపట్నం, సెల్ నెం: 6301192215

Related posts

అమ్మ పలుకు

Satyam NEWS

రావమ్మా ..

Satyam NEWS

టికానా లేనోళ్లం

Satyam NEWS

Leave a Comment