28.7 C
Hyderabad
April 20, 2024 06: 33 AM
కవి ప్రపంచం

అపర చాణక్యుడు

#Gurrala Laxmareddy

నేడే ఈనాడే మన మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు గారి శతజయంతి

మన తెలంగాణ తల్లి సిగలోన మెరిసే విరిసే మా తెలుగు వెలుగు కళాకాంతుల పూబంతి!

సమస్త సాహితీ వనమందు తాను

చేశాడు సహస్ర ఫణులతో విందు

చదివిన వారికి అది బహు పసందు విన్నవారికి ఏమో కలిగించు కనువిందు!

పలు ఆర్థిక సంస్కరణలను సంధించిన వాడు ఆర్థిక వ్యవస్థను సక్రమ మార్గంలో నడిపించిన రేడు

భారతదేశ ఆర్థిక స్థితిగతులను పరిపుష్టం గావించి

భారతీయుల కరువు బరువు తొలగించే తాను సాహసించి!

అరాచకాల  అఘాయిత్యాల తాను అరికట్టి

భిన్నత్వంలో ఏకత్వాన్ని జనానికి చూపెట్టి

మన దేశ ఆర్థిక వ్యవస్థను ఉద్ధరించిన ఉద్దండుడు

అవస్థ లేని వ్యవస్థకు బీజం విత్తిన  సంసిద్ధుండు!

రాజకీయ శక్తి  యుక్తి  యూహంలో  రాటుదేలిన

భారతావనిలో అపర చాణుక్యుడై  ఏలిన

మీ అపూర్వ జ్ఞాపకాల నీడల్లో మేమంతా జీవిస్తాం

సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిన్నే స్మరిస్తాం!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి

Related posts

అక్షరాశృతర్పణం

Satyam NEWS

ఆశల తొలకరి

Satyam NEWS

ఉపజ్ఞ కు ఉపద

Satyam NEWS

1 comment

కందికొండ రవి కిరణ్ September 23, 2020 at 10:13 PM

పాములపర్తి
*************
వెంకట నరసింహా!
దేశ సంకటనాశ నృసింహా!
ఆర్ధిక సంస్కరణల కాదిపురుషా!
తెలుగు వెలుగు జిలుగుల్లో
సింహ భాగస్థుడా!
పదునాలుగు భాషల ప్రవీణుడా!
విశ్వనాథు పడగలు
వేయిటిని సహస్ర ఫణ్ గ చేసి
ఉత్తర భారతాన
నాట్య మాడించిన ఆంధ్ర తేజమా!
భారతావని నేలిన భారత రత్నమా!
మౌనమె వదనాలంకార మైన సుజ్ఞానీ!
ఇప్పటి ప్రగతిని అపుడే వీక్షించిన దివ్య చక్షువా!
తెలుగు జాతికి గర్వకారణమా!
తెలుగు నేలను బుట్టిన అనర్ఘ రతనమా!
నీదు శతజయంతికివి నా జోతలు.
*__కందికొండ రవి కిరణ్*
9491298990

Reply

Leave a Comment