30.7 C
Hyderabad
April 19, 2024 08: 55 AM
కవి ప్రపంచం

మీకు సాటి మీరే

#K.Swarnalatha

వందేమాతర గీతాలాపనతోనిజాంపాలనను

ధిక్కరించిన విద్యార్ది నాయకుడు

తనని వరించిన పదవులు ఎన్నోఎన్నెన్నో!

పదవులకేవన్నె తెచ్చిన ప్రజ్ఞావంతుడు

గురుకులాలకు నాందిపలికిన విద్యావేత్త

ఓపెన్ జైల్ విధానానికి శ్రీకారంచుట్టిన సంస్కర్త

భూగరిష్ట పరిమితిచట్టాన్నితెచ్చిన చరితార్దుడు

 సి.యం పదవిని త్యజించిన స్థితప్రజ్ఞుడు

సమకాలీన రచనలతో స్పందించిన రచయిత

“వేయిపడగల”ను హిందీలోనికి అనువదించిన సాహితీవేత్త

“లోపలిమనిషి”లో తనఅంతరంగాన్ని ఆవిష్కరించిన నిష్కపటి

బహుబాషా కోవిదుడు.

ఆయా భాషలను అనర్గళంగామాట్లాడే శక్తిమంతుడు

అనేక సందర్బాలలో మౌనాన్నే ఆయుధంగా వాడిన విజయుడు

దక్షిణాది నుండి ప్రధాని పీఠం అధిష్టించిన ఘనుడు 

భరత దేశ ఖ్యాతిని ఖండాం తరాలకు చాటిన మహామేధావి

కుదేలైన దేశఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన సమర్థుడు

మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపిన అపరచాణక్యుడు.

విధినిర్వహణలో రేయింబవళ్ళు కష్టించి

మాతృభూమి బుుణంతీర్చుకొన్న మహామనీషి

మన తెలంగాణా ముద్దుబిడ్డ

పి.వి నరసింహారావుగారు

వారికిసాటి వారే.

కే.స్వర్ణలత, కొత్తపేట, హైదరాబాదు, ఫోన్:9121580875

Related posts

ఆడపిల్లను కాపాడుకుంటేనే సమాజం వికసిస్తుంది

Satyam NEWS

నడక మళ్ళీ ఇంటి వైపుకే..

Satyam NEWS

మన  ఘన  వారసత్వం

Satyam NEWS

Leave a Comment