35.2 C
Hyderabad
April 24, 2024 13: 42 PM
Slider కవి ప్రపంచం

విశ్వశాంతి

#Manjula Surya New

ఎటు చూసినా సూక్ష్మజీవుల రాజ్యము

మనుషులను తమకు గులాములను చేసుకుంటూ

మనసులను భయం గుప్పిట్లో బిగించేస్తూ

మాస్కులతో స్వేచ్ఛను కబళిస్తూ

ప్రశాంతంగా కనిపిస్తున్న నిశ్శబ్ద అశాంతి ప్రపంచం

ప్రకృతి తనకు ప్రాణభిక్షను పెట్టమంటూ

సునామి భూకంపాలతో తన అనారోగ్య పరిస్థితిని తెలుపుతూనే ఉంది

తనను కాపాడమని వేడుకుంటూనే ఉంది

కానీ డబ్బు హోదాల పరుగుల వేటలో

పట్టించుకునే తీరికేది

సమతుల్యత సమాధి కాబోతున్నా మనిషిలో చలనమేది

శపించబడ్డాము  మనం మన  స్వయం కృతాపరాధాలతో

అందుకే రోజు రోజుకి విలువ పెంచుకుంటున్నాయి ఇంద్రియాలు

ముట్టుకుంటే మరి ప్రాణమే వాటి ఖరీదు

సంప్రదాయాల వేర్లని వేరుచేసిన మనమే నేడు మళ్ళీ వేళ్లూనుకునే దిశగా  మొదలుపెట్టాము ప్రయత్నాలే

ఐనా చేసిన పాపం ఊరికే పోతుందా

ఆ ప్రక్షాళనలో ఎందరి ప్రాణాలు బలికావాలో

ఎందరి ఆకలి కేకలు మారుమ్రోగాలో

ఇంతటి కల్లోల పరిస్థితిలో శ్వేత కపోతాన్ని

పట్టించుకునే నాథుడేడి

అంతటా ప్రాణం కోసం జరుపుతున్న  పోరాటమే

మనిషి తన మనుగడ కోసం

పడుతున్నాడు ఆరాటమే

మనసుతో మనుషులతో సూక్ష్మ జీవులతో

చేస్తున్నాడు యుద్ధమే

హింసలు ఉగ్రవాదాలు దురాక్రమణలు

అత్యాచారాలు మోసాలు మత మౌడ్యాలతో అధికార దాహాలతో క్రైమ్ సినిమాని తలపించే జగతి ఒక కృత్రిమ రంగుని పులుముకుని మౌనగీతాన్ని ఆలపిస్తోంది నేడు

ఇది మానవత్వం అనే సహజ రంగులతో ప్రభవిల్లుతూ మారిన మారుతున్న మనుషుల నైజాలు విశ్వశాంతికి ఆజ్యమై  భావితరానికి ఆదర్శమై మెలగాలని ఆశిస్తూ ఖండ ఖండాలుగా అడ్డుగోడలను సృష్టించుకున్న ప్రపంచము ఆ అంతరాలను తుడుచివేసేదిశగా అడుగులు వేయాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్షరీకరించాను శాంతి కపోతానికి రెక్కల బలమై 

(అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా)

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

శ్రీ‌శైలంలో 16 నుంచి అక్క‌మ‌హాదేవి బోటింగ్ ట్రిప్‌

Sub Editor

“నేనెవరు” ఫస్ట్ సాంగ్ ‘నిలువవే’ లాంచ్

Satyam NEWS

250కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

Bhavani

1 comment

వనపర్తి గంగాధర్ September 23, 2020 at 11:04 AM

రోజురోజుకు సమాజంలో పెరుగుతున్న ఆరాసిగకాలకు, అక్రమాలకు అంతెక్కడో,సమసమాకస్థాపన ేేపుదు జరుగుతుందో అంతు లేని ప్రశ్నలుగ మిగిలిపోతున్నాయ్

Reply

Leave a Comment