39.2 C
Hyderabad
April 23, 2024 17: 20 PM
Slider కవి ప్రపంచం

భాష్పాంజలి

#Immdi Rambabu

అంతర్యామి..అలసితి సొలసితి

అంటూ.. ఏడు కొండలవాడి సన్నిధికేగిరి

పాటల పెన్నిధి ..పాటల మాంత్రికుడిగా

సంగీత సామ్రాట్ వై..గాన లహరిలో

మునగంగా అంటూ.. టాటా..బై బై చెప్పి

శంకరాభరణ రాగాలాపన చేస్తూనే

శంకరుని నుదుట ఆభరణమయ్యావు

గాన సరస్వతీ మిమ్మనుగ్రహించే..

గాన కోకిలవై ..పాడుతా తీయగా తో

శతాధిక శిష్యులతో.. వాణీ,గీర్వాని లకు

స్వరాభషేకం చేశావు శివరంజని రాగ చంద్రికగా

మీ సుస్వర స్వర్ణ గళానా

పదహారణాల పడుచుల కోసం

యుగళ గీతాలు విరహ గీతాలు,

ప్రేమరస, సంగీత గీతాలు

16 భాషల పాటల ప్రేమికుల

పంచ సహస్ర గీతాలతో

ప్రపంచ పాటలు ప్రియుల మనసును దోచి

విశ్వ చరిత్ర పుటలకు ఎక్కావు

భక్త పారవశ్య గీతాలాపనతో

సకల మతాల భక్తుల గుండెల గుడిలో

దేవుడు అయ్యావు.. నిత్య పూజలు అందుకొన

పండితారాధ్యుల బాలు. మీ రాగాల స్వర్ణ గళాన

ముప్పది నంది పలు డాక్టరేటు పద్మభూషణ ఎన్నెన్నో అవార్డులు స్వర్ణాభరణాలతో శోభిల్లుతున్నారు

చలనచిత్రాలలో విభిన్న పాత్రలతో

ప్రేమ ప్రేమ కోసం పవిత్ర బంధం తో

ముడి వేసుకుని.. మర్యాద రామన్న

పోతులూరి బ్రహ్మంగారి పాత్రలతో

సజీవుడవైన బాలుజి తాళికట్టు శుభవేళ ..

గీతాలు జీవిత పరమార్థమును..

చరమాంకం వరకు లోకానికి తెలిపావు

శత నటులకు గళ అర్పణ చేశావు

మల్లికార్జునాది శిష్యులకు

బతుకు బాట చూపావు.

మీ పాటలకు గ్లామర్ గ్రామర్ ప్రాణం మీరే

ఈ లోకం లో ఇక సెలవు అని

స్వర్గలోకం మీ స్వర లహరి వినిపించ..

దివి నుండి భువికేగిన మీకు

అశేష జనులు తేలుపుతున్నారు

కన్నీటి వీడ్కోలు… ముకుళిత హస్తాలతో

అంజలి ఘటిస్తున్నారు. అయినా

ప్రతి గాయకుని గళంలో  మీరు సజీవం.

గాన గంధర్వుడు బాలు కి అక్షర పుష్ప భాష్పాంజలి

ఇమ్మడి  రాంబాబు, తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు

Related posts

అత్త సొమ్ము అల్లుడు దానం.. చంద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్ళు జగన్ పంపిణీ

Bhavani

KBC 11వ సీజన్‌ మొదటి కోటీశ్వరుడు సనోజ్‌ రాజ్‌

Satyam NEWS

21వ తేదీన మద్యం దుకాణాల వేలం

Bhavani

Leave a Comment