37.2 C
Hyderabad
April 19, 2024 13: 37 PM
Slider కవి ప్రపంచం

జన్మదిన కానుక

#Manjula Surya New

బక్కచిక్కిన మనిషిలో మొక్కవోని

ఆత్మబలము చూడు

బోసినవ్వుల మాటున సమస్యల

సంఘర్షణ చూడు

ముడతలు పడిన చర్మము మాటున

లాఠీ దెబ్బల గాయాలు చూడు

సత్యం అహింసలు రెండు కళ్ళుగా

కళ్లజోడు వెనుక దాగిన వైనం చూడు

సాదా సీదా చేనేత వెనుక

జాతిని సంఘటితపరిచిన నేతను చూడు

ఊతమిచ్చిన ఊతకర్ర

సాయుధపరిచిన జీవకర్ర

నిష్ఠ కలిగిన నిరాడంబర జీవితం

అందరికీ ఆదర్శమైన తీరు చూడు

ఉప్పెనలాగా ఉద్యమించిన

ఉప్పు సత్యాగ్రహం ఉడుకు చూడు

మాతృభూమి దాస్య విముక్తికి

తడబడని అడుగుల నిబ్బరం చూడు

విశ్వమంతా పేరుగాంచిన

భారత జాతిపితను గర్వంగా చూడు

చూసి నేర్చుకో కొంత అయినా

అతని బాటలో నడిచి అయినా

మార్చుకో నిను మరి కొంత అయినా

మానవత్వాన్ని మంటగలపక

శాంతి పావురాన్ని ఎగురవేసేయ్

మహాత్ముని ఆశయాలు మళ్ళీ చిగురించేలా

చేసేయ్

సంస్కరించిన సమ సమాజాన్నే

సవినయంగా కానుకగా అర్పించేసేయ్

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

తహసీల్దార్, యస్సైల పై కోర్టు ధిక్కరణ పిటీషన్

Bhavani

గవర్నర్ ఆహ్వానంతో రొట్టె విరిగి నేతిలో పడ్డ శివసేన

Satyam NEWS

మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘ నేతలు

Satyam NEWS

Leave a Comment