35.2 C
Hyderabad
April 24, 2024 14: 22 PM
కవి ప్రపంచం

నాడు- నేడు

#Dr.Sammeta Vijaya

దేశం కోసం ప్రాణత్యాగం నాడు

తన ప్రాణంతో పాటు

లక్షల మందిని చంపడానికి

సిద్ధంగా ఉన్నారు నేడు

దేశం కోసం ఐక్యత నాడు

దేశానికే ద్రోహం తలపెడుతున్నారు నేడు

నిస్వార్ధం, త్యాగం, అంకితభావం

అడుగునా నడిపించాయి నాడు

స్వార్థం, కుతంత్రం, కుట్రలు

పేట్రేగిపోతున్నాయి నేడు

ఆత్మార్పణ, ఆమరణ నిరాహారదీక్ష నాడు

బాంబుదాడులు,మెరుపు దాడులు నేడు

ఆత్మరక్షణ అభిమానం ఆచరణ నాడు

అశ్లీలం, అరాచకత్వం, అమానుషత్వం నేడు

అమాయకత్వం, అన్యోన్యత, ఆప్యాయత నాడు

అవినీతి,అత్యాచారం,విశృంఖలత్వం నేడు

పొందిక, పొదుపు,జాగ్రత్త నాడు

విందులు, విలాసాలు, మత్తు మందులు నేడు

విలువలకి ప్రాధాన్యం నాడు

విచ్చలవిడితనానికి పరాకాష్ట నేడు

ఆనాటికీ ఈనాటికీ ఎన్నో మార్పులు

అప్పుడూ మనమే ఇప్పుడూ మనమే

మారనిదొక్కటే మన ఆలోచనావిధానం

రాజకీయాలలో లీనమై స్వార్ధానికి బానిసలై

అవినీతి ఆలవాలమై విషసంస్కృతికి మారుపేరై

మనల్ని మనం కోల్పోతున్నాం నేడు

తన అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని

రూపొందించడానికి బాపు ఉన్నాడు నాడు

దేశాన్ని కాపాడడానికి సమాజంలో మార్పుకి

ప్రతిమనిషీ కావాలి బాపూ నేడు.

డా.సమ్మెట విజయ

Related posts

రెండో సగం?

Satyam NEWS

మేరు కరుణ ధీరణి

Satyam NEWS

ఉజ్వల భవిత

Satyam NEWS

Leave a Comment