35.2 C
Hyderabad
April 24, 2024 11: 04 AM
Slider కవి ప్రపంచం

నేల నుదుటిపై నాగలి సంతకం

#Kondapally Niharini

వాన చుక్కల గీతానికి

పచ్చనిమొక్కల నమస్సులు చేస్తున్న మట్టి , అతని చెమటకు పరిమళాలు అద్దుతున్నది.

కాయకష్టపు అంగి జేబుల్లో

పనితనపు శిల్పానికి అమావాస్యలు

పూస్తున్నా , బురదకాళ్ళను కాలువలో కడిగినంత సుందరంగా అతడు కంచంలో తెల్లని వెన్నెలను పంచుతాడని నేలమ్మకు తెలుసు.

కండలు కరిగించే అతని                                                  

భుజాల రెక్కలకు ఏదో నవయవ్వనం వచ్చినట్టున్నదని

మురిసిపోతుంది ఎండనుదాచే వానాకాలం.

తలరాతలు మార్చే తరాజులో అతనేమీ అదృష్ట దురదృష్టతూనికలేయక కార్తె కార్తెకూ కాతల మధ్యవర్తి అవుతాడు .

కప్పలసయ్యాటల్ల, గోరుకొయ్యపిలుపుల్ల

చెరువు గలగలల్నీ, పత్రహరితాన్ని, వినీలాకాశాన్ని ప్రతిఫలించే కొంగల గుంపొకటి అతని ముఖమండలంపై

మెరుస్తుంది.

పంటనూ,ఇంటినీ రెప్పలవెనుక వెలిగించే అచంచలతలా అతడు లోకం తిండికొరకే చూపుసారిస్తాడు.

తొలకరి పులకరింతల్లోని ఊహాశాలిత్వాన్ని మనందరికీ ఒదిలేసి,

ఎప్పటిలాగే పలుగు పారలతో కొత్తగీతాన్ని ఎత్తుకుంటాడు.

నేల నుదుటిపై నాగలి సంతకంచేసే అతడు నిత్య నూతనుడు !

— కొండపల్లి నీహారిణి

Related posts

వై ఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు

Satyam NEWS

కలుషిత గణేష్ ప్రసాదం తిని పిల్లల అస్వస్థత

Satyam NEWS

నిండిన ప్రధాన కాలువ:పట్టించుకోని నీటి పారుదల అధికారులు

Satyam NEWS

Leave a Comment