39.2 C
Hyderabad
April 25, 2024 16: 50 PM
కవి ప్రపంచం

మళ్లీ జన్మించు

#Devalapally Sunanda

ఒంటిపై కొల్లాయి కట్టినా

చేతిలో  ఊతకర్ర పట్టినా

ఉప్పు సత్యాగ్రహం చేపట్టినా

సహాయనిరాకరణ ఉద్యమం తలపెట్టినా

భరతావని స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే

భారతీయులకు బానిసచెర వీడాలనే

సత్యాహింసలే ఆయుధాలుగా

ఆచరణే ఆచారంగా

విదేశీ వస్తువులు బహిష్కరించి

స్వాతంత్ర్య కాంక్షను అందరి మనసుల్లో రగిలించి

క్విట్ ఇండియా అనే నినాదాన్ని ఆవిష్కరించి

అహింసా వాదమే మేలనిపించి

స్వాతంత్ర్య పోరాటం నడిపించి

బ్రిటిష్ పాలకులనుంచి స్వాతంత్ర్యం సాధించి

భారత దేశాన్ని గెలిపించి

బోసినవ్వులు చిందిస్తూ

అందరికీ తాతవైనావు

తాతంటే ఎవరంటే..

మా గాంధీతాత అనిపించుకున్నావు

రాబోయే తరం పిల్లలు

నువ్వు ఎవరో తెలియదనకుండా

పచ్చనోటుపై నీ బొమ్మ వేసి

రాబోయే తరానికి నిన్ను గుర్తుండేలా చేస్తున్నారుకానీ

నీ గురించి నువ్వు పాటించిన విలువల గురించి నేర్పడం మరచిపోతున్నారు

గాంధీతాత అంటే కూడలిలో నిలబెట్టిన విగ్రహం అనేలా చేస్తున్నారు

ఓ గాంధీ నువ్ మళ్ళీ జన్మించు

మాయమవుతున్న మానవత్వాన్ని బతికించు

వలువలూడదీసుకున్న విలువలను విశ్వవ్యాప్తం చేయడానికి

పెట్రేగిపోతున్న హింసను

అదుపు చేయడానికి

మళ్ళీ జన్మ ఎత్తి రావయ్యా

ఓ మా గాంధీ తాతయ్యా..!!

దేవలపల్లి సునంద

Related posts

ధర్మ ఛత్రం

Satyam NEWS

శక్తి స్వరూపిణి జగజ్జనని

Satyam NEWS

ఈ ఉదయం…

Satyam NEWS

Leave a Comment